- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress in this Photo, She Is Meenakshi Chaudhary
Actress : కవ్వించే అందం.. 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్.. అయినా రానీ ఆఫర్స్..
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, ప్రతిభతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సరైన క్రేజ్ సంపాదించుకోని తారలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Aug 31, 2025 | 2:03 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? తెలుగులో క్రేజీ హీరోయిన్. ఇటీవలే 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ అమ్మడుకు ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ మీనాక్షి చౌదరి.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఇటీవలే వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది. బాక్సాఫీస్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటుందని అనుకున్నారు అంతా. కానీ అలా కాకుండా ఇప్పుడు కేవలం వాణిజ్య ప్రకటనలలో మాత్రమే కానిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి అంతగా సినిమాలు వస్తున్నట్లుగా కనిపించడం లేదు.

తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. యాక్టింగ్ పరంగానూ అదరగొట్టేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అటు గ్లామర్, ఇటు ట్రెడిషనల్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.




