Sarkaru Vaari Paata: ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్‏కు సారీ చెప్పిన సర్కారు వారి పాట టీమ్.. ఎందుకంటే..

|

Jan 15, 2022 | 11:47 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తిసురేష్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం

Sarkaru Vaari Paata: ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్‏కు సారీ చెప్పిన సర్కారు వారి పాట టీమ్.. ఎందుకంటే..
Sarkaru Vaari Paata
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తిసురేష్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయ్యింది. ఇప్పటికే కరోనా సెంకడ్ వేవ్, మహేశ్‌ మోకాలి సర్జరీ కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది. అలాగే ఇటీవల మహేష్ బాబు కరోనా బారిన పడడంతో సర్కారు వారి పాట సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అనే సందేహంలో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా సర్కారు వారి పాట నుంచి మ్యూజికల్ ఫీస్ట్ మొదలవుతుందని అందులో భాగంగా సాంగ్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తమన్ గతంలో తెలియజేశారు.

అయితే అనుహ్యాంగా తమన్ కరోనా భారీన పడడంతో ఈ పని కూడా మధ్యలోనే బ్రేక్ పడింది. దీంతో సంక్రాంతికి సర్కారు వారి పాట నుంచి ఇద్దామనుకున్న మ్యూజికల్ ఫీస్ట్ ఇవ్వలేకపోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట మ్యూజికల్ ఫీస్ట్ జనవరి 26న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

ఇక కరోనా, ఓమిక్రాన్ ప్రభావం మరోసారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకాగ విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా నుంచి రావాల్సిన అప్డేట్స్ కూడా ఆలస్యం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి నిరాశ ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు.. మహేష్.. తమన్ కరోనా భారీన పడడంతో సర్కారు వారి పాట మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న టెన్షన్ అభిమానుల్లో కలుగుతుంది. ఇప్పటికే సినిమాను సంక్రాంత్రి నుంచి సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కరోనా కారణంగా అనుకున్న తేదీకి సినిమా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..