Sarkaru Vaari Paata: ఆ స్వాగ్ అండ్ స్టైల్ మహేష్‌బాబుకే సొంతం.. దూసుకుపోతున్న ‘సర్కారు వారి పాట’ ట్రైలర్
నా ప్రేమను, నా స్నేహాన్ని కాదు.. నా మనీని దొంగిలించు చూద్దాం అని తాను మనీ మైండెడ్ అని పబ్లిక్‌గా చెప్పేశారు మహేష్‌బాబు. కానీ... నాటోన్లీ మనీ.. హి ఈజ్ రికార్డ్ మైండెడ్ అని ఆ టైలర్ రిలీజ్ తర్వాతే తెలిసొచ్చింది.

నా ప్రేమను, నా స్నేహాన్ని కాదు.. నా మనీని దొంగిలించు చూద్దాం అని తాను మనీ మైండెడ్ అని పబ్లిక్‌గా చెప్పేశారు మహేష్‌బాబు(Mahesh Babu). కానీ… నాటోన్లీ మనీ.. హి ఈజ్ రికార్డ్ మైండెడ్ అని ఆ టైలర్ రిలీజ్ తర్వాతే తెలిసొచ్చింది. మిగతా హీరోల రికార్డుల్నే కాదు తన సినిమా టైలర్ల నంబర్స్‌ని కూడా కొల్లగొట్టి.. టైలర్ వార్‌లో సరిలేరు నాకెవ్వరు అనిపించుకుంటున్నారు సూపర్‌స్టార్. మిలియన్ల వ్యూస్‌తో దూకుడు మీదుంది సర్కారువారి పాట(Sarkaru Vaari Paata)టైలర్. ఆ స్వాగ్ అండ్ స్టైల్ జస్ట్ మహేష్‌బాబుకే సొంతమని తేల్చేశారు డైరెక్టర్ పరశురామ్. తొలి 24 గంటల్లో అయితే.. 27మిలియన్ల వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది సర్కారువారి టైలర్. ఆవిధంగా తన కొలీగ్ హీరోలందరి రికార్డుల్ని ఒంటిచేత్తో చితక్కొట్టేశారు ఘట్టమనేని హీరో.
ఇండియన్ సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండం అనిపించుకున్న బాహుబలి సెకండ్ పార్ట్ ట్రయిలర్… 21.81 మిలియన్లతో అప్పట్లో టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాతొచ్చిన జక్కన్న తాజా వండర్ ట్రిపులార్.. ట్రయిలర్‌తోనే నేషనల్ సెన్సేషన్ అనిపించుకుంది ట్రిపులార్ తెలుగు వెర్షన్ 20.45 మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్‌సాబ్ టైలర్ స్కోరు 18.05 మిలియన్లు. ఆ తర్వాతి ప్లేస్ ఐకాన్‌స్టార్‌దే. బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప టైలర్ కంటెంట్ టూ మాసీగా ఉండడంతో 15.19 మిలియన్లను క్రాస్ చేసింది. అంతకుముందు బాహుబలి క్రేజ్‌ని పెట్టుబడిగా చేసుకుని, డైహార్డ్ ఫ్యాన్స్ మనసు దోచుకున్న సాహో టైలర్ పన్నెండున్నర మిలియన్లు కొల్లగొట్టింది.
టెరిఫిక్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పవర్‌ప్యాక్డ్ అనిపించిన అఖండ ట్రయిలర్ 10.49 మిలియన్లతో సరిపెట్టుకుంది. ఆ మాటకొస్తే… తన గత సినిమాల రికార్డుల్ని తానే బద్దలుకొట్టారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. మహర్షి టైలర్ 24 గంటల్లో 7.31 మిలియన్ల స్కోర్ చేస్తే… సరిలేరు నీకెవ్వరు 7.26 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది. యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఏ ఒక్క ఫ్లేవర్‌నీ వదిలిపెట్టకుండా.. మహేష్‌లోని అన్ని వేరియేషన్స్‌నీ రెండున్నర నిమిషాల్లో 105 షాట్స్‌తో చూపెట్టి.. ట్రయిలర్ అంటే ఇదేరా అనిపించి.. ఇప్పటికీ జెట్ స్పీడ్‌తో ట్రెండవుతోంది సర్కారువారి పాట ట్రయిలర్. సినిమా ఫైనల్ రిజల్ట్‌ని ప్రిడిక్ట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ట్రయిలరే. అందుకే ట్రయిలర్‌కొస్తున్న రెస్పాన్స్‌తో సర్కారువారి పాట బిజినెస్ లెక్కల్లో కూడా మార్పులొచ్చేశాయట.







