Sarkaru Vaari Paata: సోషల్ మీడియా షేక్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహేష్ మూవీ పోస్టర్..

| Edited By: Ravi Kiran

Aug 03, 2021 | 8:37 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీత గోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్న..

Sarkaru Vaari Paata: సోషల్ మీడియా షేక్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహేష్ మూవీ పోస్టర్..
Mahesh
Follow us on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీత గోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఫస్టు నోటీస్ అంటూ మహేశ్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు మహేష్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

పోస్టర్ తోనే రికార్డుల వేట మొదలు పెట్టాడు మహేష్ సోషల్ మీడియాలో మహేష్ పోస్టర్ దూసుకుపోతుంది. 24 గంటల్లోనే 95.6 కే లైక్స్ ను, 49.1కే  రీ ట్వీట్ లను సాధించిన ఈ పోస్టర్, సరికొత్త రికార్డులను సృష్టించింది. అలాగే అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన పోస్టర్ గా కూడా కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సర్కారు వారి పాట సినిమానుంచి టీజర్ ను విడుదల చేయాలనీ చూస్తున్నారు చిత్రయూనిట్. పోస్టరే ఈ రేంజ్ రికార్డ్ క్రియేట్ చేస్తే మరి టీజర్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: పామే కదా అని ఆడిద్దామనుకున్నాడు..ఒళ్ళుమండిన పాము ఏం చేసిందో చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం!

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..