
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ పాన్-వరల్డ్ స్టార్ కూడా మారనున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ బాబు స్టార్ హీరోనే కాకుండా మంచి బిజినెస్ మెన్. ఏఎమ్ బీ మాల్ పేరుతో మల్టీ ప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు మహేష్.
మహేష్ బాబు యాజమాన్యంలోని AMB సినిమాస్ పేరిట ఇప్పటికే హైదరాబాద్‌తో సహా చాలా నగరాల్లో మల్టీ ప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. ఇవి ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తున్నాయి. AMB సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ లతో పాటు హోటల్, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు తన AMB వ్యాపారాన్ని బెంగళూరుకు కూడా విస్తరించాడు. అంటే ఈ AMB సినిమాస్ బెంగళూరులో కూడా ప్రారంభం కానుంది. నగరంలో చారిత్రాత్మక సినిమా హాల్ ఉన్న ప్రదేశంలోనే మహేష్ బాబు తన కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు.
మహేష్ బాబు కొత్త సినిమా థియేటర్ కపాలి సినిమా స్థలంలో రాబోతోంది, ఇది ఆసియాలోనే అతిపెద్ద సినిమా థియేటర్. సినీరామ్ టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి సినిమా థియేటర్.ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రారంభం కానున్న సినిమా థియేటర్ కు ‘AMB సినిమాస్ కపాలి’ అని పేరు పెట్టారు. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం డిసెంబర్ 16న జరుగనుందని సమాచారం. మహేష్ బాబు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్.
AMB సినిమాస్‌లో 60 అడుగుల వెడల్పు మరియు 60 అడుగుల పొడవు గల తొమ్మిది స్క్రీన్‌లు ఉంటాయి. ప్రతి స్క్రీన్ ఒకేసారి 600 మంది ప్రేక్షకులకు వసతి కల్పిస్తుంది మరియు స్క్రీన్‌లు ఉత్తమ వీడియో నాణ్యతను కలిగి ఉంటాయి. యాంబియంట్ లైటింగ్‌తో పాటు, మీరు ఉత్తమ ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు.
మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల, హైదరాబాద్‌లోని RTCX రోడ్డులో మరో మల్టీప్లెక్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.