దళపతి విజయ్(Vijay )కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమా వస్తుందంటే కోలీవుడ్ తో పటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వారసుల విజయాలతో దూసుకుపోతోన్న దళపతి ప్రస్తుతం డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. టాలెంటడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వంశీ పైడిపల్లి. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విజయ్ నటిస్తున్న ఈ సినిమాకు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట . ఆ స్టార్ హీరో ఎవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లికి మహేష్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరు మంచి మిత్రులు గా మారారు. మహేష్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ టూర్స్ లోను వంశీ ఫ్యామిలీ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక విజయ్ అంటే తనకు ఇష్టమని గతంలో మహేష్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా.. ఇక మహేష్ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఇవ్వడం కొత్తేమీ కాదు.. అప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు, ఆతర్వాత తారక్ బాద్షాకు , రీసెంట్ గా మెగాస్టార్ ఆచార్య సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు దళపతి సినిమాలో మహేష్ తన గాత్రాన్ని వినిపించనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.