Mahesh Babu: యాషెస్‌లో ఇంగ్లండ్‌ షాకింగ్‌ డిక్లరేషన్‌.. ‘బజ్‌బాల్‌’ ఎఫెక్ట్‌పై మహేశ్‌ బాబు ట్వీట్‌ వైరల్‌

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న యాషెస్‌ సమరం మొదలైంది. బర్మింగ్‍హామ్ వేదికగా శుక్రవారం మొదలైన మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత కొన్ని రోజులుగా బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోన్న ఇంగ్లండ్‌ యాషెస్‌ టెస్టులోనూ అదే దూకుడు చూపించింది.

Mahesh Babu: యాషెస్‌లో ఇంగ్లండ్‌ షాకింగ్‌ డిక్లరేషన్‌.. బజ్‌బాల్‌ ఎఫెక్ట్‌పై మహేశ్‌ బాబు ట్వీట్‌ వైరల్‌
Mahesh Babu

Updated on: Jun 17, 2023 | 8:47 PM

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న యాషెస్‌ సమరం మొదలైంది. బర్మింగ్‍హామ్ వేదికగా శుక్రవారం మొదలైన మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత కొన్ని రోజులుగా బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోన్న ఇంగ్లండ్‌ యాషెస్‌ టెస్టులోనూ అదే దూకుడు చూపించింది. వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్ (152 బంతుల్లో 118) శతకం, జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78 పరుగులు) వేగంగా పరుగులు చేయడంతో 8 వికెట్లకు 393 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది ఇంగ్లండ్‌. 400 పరుగుల లోపే.. అది కూడా మొదటి రోజు పూర్తవ్వకుండానే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ తీసుకున్న డిక్లరేషన్‌ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఆసీస్‌ను బ్యాటింగ్‌ కు ఆహ్వానించి కనీసం 1-2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుదామనే ఇంగ్లండ్ సారథి స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే బర్మింగ్‌ హామ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఆటతీరుపై టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ ప్రేమికుడైన అతను ఇంగ్లండ్‌ షాకింగ్‌ డిక్టరేషన్‌పై స్పందిస్తూ ‘393-8 డిక్లేర్డ్.. నేను చదువుతున్నది నిజమేనా.. వావ్.. జస్ట్ వావ్.. నవ శకం క్రికెట్‍ను చూస్తున్నాం.. బజ్‍బాల్’ అని ఇంట్రెస్టింగ్‌ ట్వీట్ చేశాడు మహేశ్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు బదులుగా బరిలోకి దిగిన ఆసీస్‌ తడబడుతోంది. కడపటి వార్తలందే సమయానికి కంగారూలు 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (84), క్యామెరూన్‌ గ్రీన్‌ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..