ఇది మహేశ్ స్టామినా..సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన రేంజ్ ఏంటో చూపించాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్విటర్‌లో  90 లక్షల ఫాలోవర్స్‌ సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. నెక్ట్స్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి, ఆయనను ఫాలో అయ్యేవాళ్లు కోటిమంది అవుతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. మహేశ్ 2010 ఏప్రిల్‌లో ట్విటర్ ఖాతాను ప్రారంభించాడు. కాగా తెలుగు సూపర్‌స్టార్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం 26 […]

ఇది మహేశ్ స్టామినా..సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్
Follow us

|

Updated on: Mar 07, 2020 | 3:56 PM

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన రేంజ్ ఏంటో చూపించాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్విటర్‌లో  90 లక్షల ఫాలోవర్స్‌ సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. నెక్ట్స్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి, ఆయనను ఫాలో అయ్యేవాళ్లు కోటిమంది అవుతారని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మహేశ్ 2010 ఏప్రిల్‌లో ట్విటర్ ఖాతాను ప్రారంభించాడు. కాగా తెలుగు సూపర్‌స్టార్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం 26 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వంశీ పైడిపల్లితో పాటు జయదేవ్ గల్లా లాంటి ప్రముఖులు, పలువురు క్రికెటర్స్ ఉన్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో తన ఫాలోవర్స్‌కు థాంక్స్ చెప్పాడు మహేశ్.

ఈ ఏడాది పొంగల్‌కి  ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్‌‌హిట్ అందుకున్నాడు మహేశ్. ఆయన తదుపరి సినిమా విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లోనే సినిమా ఉండనుందని టాలీవుడ్ సమాాచారం. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్​లో రానున్న ‘ఆచార్య’లోనూ ఓ స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Latest Articles