AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈ ఒక్క పనిచేయకపోతే మీ పీఎఫ్ డబ్బులకు బ్రేక్.. అందరూ ఒక్కసారి చెక్ చేసుకోండి..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్‌వో హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ వివరాలపై కీలక సూచన జారీ చేసింది. వివరాలు తప్పుగా ఉంటే భవిష్యత్తులో నష్టపోయే అవకాశముందని, అన్నీ చెక్ చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా కంపెనీలు మారేవారికి ఉపయోపగడేలా సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

EPFO: ఈ ఒక్క పనిచేయకపోతే మీ పీఎఫ్ డబ్బులకు బ్రేక్.. అందరూ ఒక్కసారి చెక్ చేసుకోండి..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Apr 09, 2026 | 10:24 AM

Share

మీరు ఈపీఎఫ్‌వో ఖాతాదారులా..? కంపెనీలు మారాలా..? అయితే మీకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) హెచ్చరికలు జారీ చేసింది. కంపెనీలు మారేటప్పుడు పీఎఫ్ ఖాతాలలో నమోదు చేసిన వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేటా కరెక్ట్‌గా చూసుకోవాలని తెలిపింది. అందులో పొరపాట్లు ఉండే భవిష్యత్తులో సమస్యలు ఎదురుకావొచ్చని స్పష్టం చేసింది. చాలామంది కంపెనీ నుంచి బయటకు రాగానే వివరాలు చెక్ చేసుకోరు. తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నా, క్లెయిమ్ చేసుకోవాలన్నా లేదాపెన్షన్ పొందాలన్నా వివరాలు తప్పుగా ఉంటే నేరుగా ప్రభావితం చూపిస్తుంది.

ఎగ్జిట్ డేట్ చూసుకోండి

మీరు కంపెనీలో చేరిన తేదీతో పాటు ఎగ్జిట్ తేదీ చాలా ముఖ్యం. మీరు ఒక కంపెనీలో ఎంతకాలం పనిచేశారు..? పీఎఫ్‌కు ఎంతకాలం చెల్లించారు? అనే వివరాలను అవి సూచిస్తాయి. మీకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ అర్హతను కూడా ఇవి నిర్ణయిస్తాయి. తేదీలలో పొరపాట్లు ఉంటే పెన్షన్ తగ్గడంతో పాటు పీఎఫ్ క్లెయిమ్స్‌లో ఆలస్యం జరగొచ్చు. ఒక్కొసారి క్లెయిమ్స్ తిరస్కరణకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మీరు ఏదైనా కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు పీఎఫ్ వెబ్‌సైట్లోకి వెళ్లి కంపెనీ జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ చూసుకోండి. పీఎఫ్‌పై మీకు వచ్చే వడ్డీ, మొత్తం సర్వీస్ కాలం, పెన్షన్ లెక్కలు అన్నీ కంపెనీలలో పనిచేసిన సర్వీస్ కాలంపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాలి.

ఎలా అప్డేట్ చేసుకోవాలి?

వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పిస్తోంది. ఎగ్జిట్ తేదీ తప్పు ఉంటే ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ద్వారా సరిచేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీ జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రికార్డుతో సరిపోలితేనే ఆమోదం లభిస్తాయి. ఒకవేళ మీరు ఇంతకముందు పనిచేసిన కంపెనీ మూసివేసినా లేదా యజమాని నుంచి స్పందన లేకపోయినా ఆందోళన అవసరం లేదు. ఉమ్మడి డిక్లరేషన్ ఫారంను పూర్తి చేసి ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదించాలి. దీంతో అధికారులు మీ వివరాలను అప్డేట్ చేస్తారు. అనంతరం యూఏఎన్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో పీఎఫ్ సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అందుకే పీఎఫ్ వివరాలు ఎప్పుడ చెక్ చేసుకుంటూ అప్డేటెడ్‌గా ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Follow Us
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!