Mahesh Babu: నీ దూకుడు.. సాటెవ్వడు.. బాబు అంటే అంతే మరి.. సౌత్‌లో మరే హీరోకి లేని రికార్డ్

మహేష్ బాబుకు రికార్డులేం కొత్త కాదు.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సాధించారు సూపర్ స్టార్. తాజాగా మరో అరుదైన ఘనత ఈయన ఖాతాలో చేరిపోయింది. సౌత్ ఇండియాలో మరే నటుడికి దక్కని అరుదైన గౌరవం అది. దాంతో పండగ చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. మరి మహేష్‌కు మాత్రమే దక్కిన ఆ ఘనత ఏంటి..? మిగిలిన హీరోలకు ఎందుకు అది దక్కట్లేదు..?

Mahesh Babu: నీ దూకుడు.. సాటెవ్వడు.. బాబు అంటే అంతే మరి.. సౌత్‌లో మరే హీరోకి లేని రికార్డ్
Mahesh Babu
Follow us
Ram Naramaneni

| Edited By: Basha Shek

Updated on: Mar 31, 2023 | 5:04 PM

టాలీవుడ్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి పరిచయాలు అవసరం లేదు. కేవలం బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలోనూ రప్ఫాడిస్తున్నారు సూపర్ స్టార్. తాజాగా ఈయన మరో రికార్డు అందుకున్నారు. ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్.. ప్లేస్ మారినా బాబు బ్యాండ్ మాత్రం ఆగట్లేదు. మూడు ప్లాట్ ఫామ్స్‌లో 10 మిలియన్స్ ఫాలోయర్స్‌తో నయా రికార్డుకు తెరతీసారు మహేష్.

ముందు నుంచే సోషల్ మీడియాలో మహేష్ బాబుకు ఫాలోయింగ్ ఎక్కువ. మన హీరోలలో సగం మందికి ట్విట్టర్ అంటే తెలియకముందే మహేష్‌కు అకౌంట్ ఉంది. అలాగే FB, ఇన్‌స్టాలోనూ రెగ్యులర్‌గా అప్‌డేట్స్ పోస్ట్ చేయడమే కాకుండా.. పర్సనల్ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుంటారు మహేష్. ఈ ఫాలో అప్‌తోనే ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఫేస్‌బుక్‌‌లో 15 మిలియన్.. ట్విటర్‌లలో 13.2 మిలియన్.. ఇన్‌స్టాలో 10.1 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు మహేష్‌కు. మూడింట్లో కలిపి 38 మిలియన్స్‌కు పైగా ఫాలోయర్స్‌తో సోషల్ మీడియాలో నెంబర్ వన్ అయ్యారు సూపర్ స్టార్. సినిమాలు మాత్రమే కాదు.. ఛారిటీకి సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు మహేష్.

మహేష్ రికార్డ్స్‌తో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. ఇక సినిమా మ్యాటర్‌కు వచ్చేస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024, జనవరి 13న సంక్రాంతికి విడుదల కానుంది సినిమా. మాస్ ఎంటర్‌టైనర్‌గా SSMB28 రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే