AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. భార్య పుట్టిన రోజు సొంతూరిలో ఏం చేశాడో తెలుసా?

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో. సినిమా షూటింగులతో బిజీగ ఉండే అతను పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇందులో భాగంగా వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు మహేష్.

Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. భార్య పుట్టిన రోజు సొంతూరిలో ఏం చేశాడో తెలుసా?
Mahesh Babu
Basha Shek
|

Updated on: Jan 26, 2025 | 7:32 PM

Share

గతేడాది సంక్రాంతికి గుంటూరు కారంతో అభిమానులను పలకరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఎస్ ఎస్ ఎమ్ బీ (వర్కింగ్ టైటిల్) ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇటీవల తన పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకొంది. మహేశ్ తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నమ్రతాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో సితార, గౌతమ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు మహేష్ బాబు. పేదలు, పిల్లల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేశాడు. అలా తాజాగా తన భార్య పుట్టినరోజు సందర్భంగా తన స్వస్థలం బుర్రిపాలెంలో ఒక స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ఏర్పాటు చేశాడు మహేష్. ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి టీకా డ్రైవ్ ను నిర్వహించాడు. అక్కడ సుమారు 70 మంది చిన్నారులకి హెచ్ పీవీ వాక్సిన్ అందజేశారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో తోడ్పడుతుందని ఆంధ్రా ఆస్పత్రి వైద్యులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

మహేశ్ బాబు నిర్వహించిన ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నమ్రత కూడా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేసింది. ఇక అభిమానులు, నెటిజన్లు కూడా మహేష్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బుర్రిపాలెంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్..

కాగా మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్గుగానే ఈ ముద్దుగుమ్మ ఇటీవల తెలంగాణలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తోంది. మొదట హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత దోమకొండ కోటలోని మహా దేవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.

చిలుకూరు బాలాజీ ఆలయంలో గ్లోబల్ స్టార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..