Sarkaru Vaari Paata: ‘ఇప్పటి నుంచి యాక్షన్ మామూలుగా ఉండదు’.. సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Sarkaru Vaari Paata: ఇప్పటి నుంచి యాక్షన్ మామూలుగా ఉండదు.. సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..
Sarkaruvaaripaata

Updated on: Apr 28, 2022 | 4:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.   మహేష్ బాబు ఈ మూవీలో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్పెటెషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ కోసం తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ఇదిలా ఉంటే  ‘ఇప్పటి నుంచి యాక్షన్ మామూలుగా ఉండదని’ హింటిస్తూ.. మహేష్ వైఫ్‌ నమ్రత షేర్ చేసిన ట్వీట్ అనౌన్స్మెంట్ తో ..మొదలైన బజ్.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఉపొందుకుంది. సర్కారు కుర్రాన్ని ట్రెండింగ్లో నిలుపుతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ను ఇచ్చారు చిత్రయానిట్. మే 2 న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు మహేష్ యాక్షన్ స్టైల్ ను రిలీజ్ చేశారు. మహేష్ రెండు చేతుల్లో తాళాల గుత్తులను పట్టుకొని విలన్స్ ను చితకొడుతున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.  యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ నుంచి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని మే 12న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..