Actor Vishal: హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు బిగ్ షాక్‌.. ఆ డబ్బంతా చెల్లించాల్సిందే..!

|

Apr 08, 2023 | 7:58 AM

లైకాప్రొడక్షన్స్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన తమిళ హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రూ.15 కోట్లను శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మూడు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ చిత్రాలను థియేటర్‌ లేదా ఓటీటీల్లో విడుదల చేయకుండా నిషేధం విధించింది.

Actor Vishal: హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు బిగ్ షాక్‌.. ఆ డబ్బంతా చెల్లించాల్సిందే..!
Actor Vishal
Follow us on

లైకాప్రొడక్షన్స్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన తమిళ హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రూ.15 కోట్లను శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మూడు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ చిత్రాలను థియేటర్‌ లేదా ఓటీటీల్లో విడుదల చేయకుండా నిషేధం విధించింది.

ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ నుంచి విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ కోసం రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ – లైకా ప్రొడక్షన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించడంతో తమిళనాట ఇష్యూ రచ్చ రచ్చగా మారింది.

రీసెంట్‌గా విశాల్ ఈ ఒప్పందం మీరి.. తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి స్పెషల్‌ కోర్టు… హైకోర్టు రిజిస్ట్రార్‌ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విశాల్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపి.. స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..