కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం మార్క్ ఆంటొని. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఈ సినిమా విడుదలకు హైకోర్టు నుంచి అనుమతులు లభించాయి. విడుదల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇంతకు ముందు చిత్రయూనిట్ ప్రకటించిన సెప్టెంబర్ 15నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు హీరో విశాల్ ట్వీట్ చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. అలాగే హిందీలో ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలై పై ఏర్పడిన గందరగోళం ఇప్పుడు క్లియర్ అయ్యింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో విశాల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్, ఎస్జే సూర్య, విశాల్ కాంబో సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న సమయంలోనే విశాల్, లైకా నిర్మాణ సంస్థ మధ్య ఏర్పడిన వివాదం బయటకు వచ్చింది.
No objection in court to release the movie #MarkAntony, Stay vacated.#MarkAntony all set to release on Sep 15th Worldwide and 22nd in Hindi, GB#MarkAntonyFromSep15#WorldOfMarkAntony pic.twitter.com/4eXj0Og7Y8
— Vishal (@VishalKOfficial) September 12, 2023
తమతో సినిమా తీస్తానని చెప్పి తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని .. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ తొలిసారిగా 2022లో లైకా ప్రొడక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు జరిగిన వాదనల తర్వాత లైకా సంస్థకు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని.. తన ఆస్తులు వివరాలు కూడా స్పమర్పించాలని ఆదేశించింది కోర్టు. అప్పటివరకు విశాల్ నటించిన సినిమాలు ఇటు థియేటర్లలోగానీ, అటు ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదని కోర్టు స్టే విధించింది. అయితే అప్పుడు విశాల్ కోర్టు ఆదేశాలని ఉల్లంఘించారని తన సినిమాలను విడుదల చేస్తున్నారంటూ మరోసారి కోర్టును ఆశ్రయించింది లైకా ప్రొడక్షన్స్. ఇక ఇదే కేసు సెప్టెంబర్ 8న విచారణకు రాగా.. ఇప్పటివరకు తమకు విశాల్ రూ.15 కోట్లు చెల్లించలేదని లైకా ప్రొడక్షన్ కోర్టుకు తెలిపింది. అందుకే మార్క్ ఆంటొని విడుదలపై కోర్టు నిషేధం విధించింది. అలాగే ఈకేసులో విశాల్ సెప్టెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.
There’s no stopping #PuratchiThalapathy #Vishal 🔥#MarkAntony all set for worldwide release on Sept 15th (Tamil & Telugu) & 22nd (Hindi)! 😎👍🏼#MarkAntonyFromSep15#WorldOfMarkAntony pic.twitter.com/730bTMhhwB
— Vishal Film Factory (@VffVishal) September 12, 2023
ఈ క్రమంలోనే ఈరోజు విశాల్ స్వయంగా కోర్టుకు హాజరై సమస్యను క్లియర్ చేశారు. మార్క్ ఆంటొని సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో రీతూవర్మ, సునీల్, సెల్వ రాఘవన్, అభినయ కీలకపాత్రలు పోషించారు. మొత్తానికి ఈ సినిమాను సెప్టెంబర్ 15న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.