Suriya: తమిళ హీరో సూర్యకి ఎదురుదెబ్బ.. ఆదాయపు పన్ను మాఫీ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు

Suriya: రెండు ఆర్థిక సంవత్సరాలకు (2007-2009) ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ సూపర్ స్టార్ సూర్య శివకుమార్ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆన్‌లైన్ మీడియా కథనాల ప్రకారం..

Suriya: తమిళ హీరో సూర్యకి ఎదురుదెబ్బ.. ఆదాయపు పన్ను మాఫీ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు
Suriya Sivakumar
Follow us
uppula Raju

|

Updated on: Aug 18, 2021 | 6:04 AM

Suriya: రెండు ఆర్థిక సంవత్సరాలకు (2007-2009) ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ సూపర్ స్టార్ సూర్య శివకుమార్ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆన్‌లైన్ మీడియా కథనాల ప్రకారం.. 2010లో ఆదాయపు పన్ను (IT) విభాగం సూర్య ఇంటిపై దాడి చేసింది. ఆ తర్వాత అధికారులు అతని ఆస్తులను అంచనా వేశారు. మూల్యాంకనం తరువాత రూ.3.11 కోట్లు చెల్లించాలని అతనికి నోటీసు జారీ చేశారు. అయితే సూర్య ఆదాయ పన్ను మదింపు కోసం వడ్డీ మినహాయింపును కోరుతూ 2018 లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ అతడికి ఇక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది.

మంగళవారం జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఐటి శాఖ వాదన విన్న తర్వాత ఆదాయపు పన్ను మదింపునకు సహకరించలేదని పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో సూర్య ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సూర్య ఈ మొత్తాన్ని చెల్లిస్తారా లేదా అతను ఇతర ఎంపికలను ఏమైనా పరిశీలిస్తారా అనేది వేచి చూడాలి. 2011 లో ఐటి శాఖ నటుడి ఆదాయపు పన్నును రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ .3.11 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2010 లో టి నగర్‌లోని నటుడి ఇల్లు, బోట్ క్లబ్ ప్రాంతంలోని బంగ్లా, అతని సన్నిహితుల కార్యాలయాలలో డిపార్ట్‌మెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఈ ఉత్తర్వు జారీ చేశారు.

మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందు సూర్య శివకుమార్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులను సవాలు చేశారు. అయితే ఇక్కడ కూడా సూర్యకి నిరాశ తప్పలేదు. ఆదాయపు పన్ను శాఖ చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌కి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది. తరువాత సూర్య 2018 లో ఆదాయపు పన్ను మదింపు కోసం వడ్డీ మాఫీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ని కూడా హైకోర్టు ఇప్పుడు కొట్టివేసింది.

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Viral Photos: ఈ ఫొటోలు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది..! భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలు..

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..