‘మా’లో మీరు మారరా..?

ఎప్పడూ ఇదే సీనా..? ఇక మీరు మారరా..? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..?..అవును ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రముఖులను ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు నెటిజన్లు. జనవరి 2న యాంగ్రీ హీరో రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన డైలాగ్ వార్ తాజాగా చర్చనీయాంశమైంది. అయితే గొడవలు పడటం, గుట్టు విప్పుకోవడం ఇప్పుడు స్టారయ్యింది కాదు. మురళిమోహన్ ప్రెసిడెంట్‌గా చేసిన టైంలో అంతకముందు వరకు ‘మా’ అధ్యక్ష పదవి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేది. ఇండస్ట్రీ పెద్దలు […]

'మా'లో మీరు మారరా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 02, 2020 | 6:09 PM

ఎప్పడూ ఇదే సీనా..? ఇక మీరు మారరా..? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..?..అవును ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రముఖులను ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు నెటిజన్లు. జనవరి 2న యాంగ్రీ హీరో రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన డైలాగ్ వార్ తాజాగా చర్చనీయాంశమైంది. అయితే గొడవలు పడటం, గుట్టు విప్పుకోవడం ఇప్పుడు స్టారయ్యింది కాదు. మురళిమోహన్ ప్రెసిడెంట్‌గా చేసిన టైంలో అంతకముందు వరకు ‘మా’ అధ్యక్ష పదవి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేది. ఇండస్ట్రీ పెద్దలు కూర్చోని నిర్ణయం తీసుకునేవారు. కానీ నిధులు పెరగడం, కొందరు నటీనటులు పోలిటికల్ పార్టీల తీర్థం  తీసుకోవడంతో ఆ తర్వాత నుంచి రచ్చ షురూ అయ్యింది.

ఆ తర్వాత నుంచి జనరల్ ఎలక్షన్స్ స్థాయిలో ‘మా’లో పోటీ తత్వం పెరిగిపోయింది. ఎన్నికప్పుడు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం, టీవీ డిబెట్లతో తిట్టుకోవడం..అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు ఒక్కటేమిటి..’మా’ లో వాళ్లంతేలే అని జనాలు నిట్టూర్చే స్థాయికి దిగజారిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో మహా నటులు ఉన్నారు. తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా విస్తరించిన వారు,  సినిమా ప్రాణంగా బ్రతికి, కళామతల్లికి ఎంతో సేవ చేసిన మహానుభావులు కోకొల్లలు. ఇప్పుడు కూడా టాలీవుడ్ ఊహకందని ప్రతిభను కనబరుస్తోంది. మన దర్శకులు, రచయితలు..బాలీవుడ్ సైతం ఈర్ష్యపడేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నటీనటులు కూడా జాతీయ స్థాయిలో సత్తా కనబరుస్తున్నారు. ఈ సమయంలో సిల్లీగా ఈ గొడవలేంటి. మనం నలుగురి ముందు చులకనవ్వాలా..?. స్వశక్తితో తెలుగు సినిమా చరిత్రలో తిరుగలేని అధ్యాయాన్ని నెలకొల్పిన చిరంజీవి ఉన్న స్టేజీపై ఈ చౌకబారు కీచులాటలు ఏంటి..?. ఆయనొక్కరే కాదు జాతి గర్వించదగ్గ నటులు కృష్ణం రాజు, మోహన్ బాబు లాంటి వారు కూడా ఉన్నారు. యాంగ్రీ హీరోగా సత్తా చాటిన రాజశేఖర్, పలువురు దిగ్గజ రచయితలు, టెక్నీషియన్లు ఉన్న కార్యక్రమంలో ఈ విధానం అవసరమా..?. అవును సినిమా అంటే రంగుల ప్రపంచం. వారు వేసుకునే షర్ట్ దగ్గర్నుంచి, హెయిర్ స్టైల్ వరకు ప్రతిది అనుకరిస్తుంది సమాజం. అలాంటి వారికి ఏ మెసేజ్ ఇవ్వాలో ‘మా’ అనుకునే మీ పెద్దలు డిసైడ్ చేసుకుంటే బెటరేమో.