MAA Elections 2021: మా ఎన్నికల్లో గందరగోళం.. ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య మరోసారి మాటల యుద్ధం..

|

Oct 10, 2021 | 10:42 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ముందుగానే మూడు ప్లటూన్ల బలగాలతో భారీ బందోబస్తు

MAA Elections 2021: మా ఎన్నికల్లో గందరగోళం.. ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య మరోసారి మాటల యుద్ధం..
Prakash Raj Naresh
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ముందుగానే మూడు ప్లటూన్ల బలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రం వద్ద మోహరించారు. గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు. అయితే సాఫీగా సాగుతున్న ఎన్నిక్లలో ఒక్కసారిగా చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న బెనర్జీకి.. శివ బాలాజీకి మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక మరోవైపు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోహన్‌ బాబు కోపంతో ఊగిపోయారు. పోలింగ్ సెంటర్‌లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనర్జీని చంపేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అలాగే పోలింగ్ కేంద్రం లోపం మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‏కు..మా మాజీ అధ్యక్షుడు నరేష్‏కు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై మంచు విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రంలో లేని నటీనటుల పేర్లతో ఓట్లు వేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్‌ ఆరోపణలు చేసింది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తీరును తప్పుబట్టారు నరేష్. అయితే ఇదిలా ఉంటే.. రిగ్గింగ్‌ జరుగుతోంది, సభ్యులు దాడికి దిగుతున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ప్రకాశ్‌ రాజ్‌, మంచి విష్ణు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో వారు ఒకరిపై ఒకరు చేయి వేసుకొని మాట్లాడడం గమనార్హం. లోపల ఎలాంటి గొడవలు జరగడం లేదని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వీరిద్దరూ తెలిపారు.

Also Read: MAA Elections 2021: పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్, బాలయ్య.. ఎవరు గెలుస్తారని చెప్పారంటే..

Bandla Ganesh: మా ఎన్నికల్లో బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్.. జీవిత మీద తన కోపాన్ని ఎలా చూపించాడో చూడండి..

MAA Elections 2021:  క్యా సీన్ హై.. ఎన్నికల కేంద్రంలో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్య ఆసక్తికర సన్నివేశం…