MAA Crisis: నా భార్య చనిపోతే కనీసం పలకరించలేదు.. నరేష్ తీరుపై ఎమోషన్ అయిన ఉత్తేజ్!

మా ఎన్నికలు తెచ్చిన సంక్షోభం కొత్త కోణం తీసుకుంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పానెల్ తరుపున గెలిచిన అందరూ రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ఒక్కొరుగా మాట్లాడుతూ వస్తున్నారు.

MAA Crisis: నా భార్య చనిపోతే కనీసం పలకరించలేదు.. నరేష్ తీరుపై ఎమోషన్ అయిన ఉత్తేజ్!
Maa Crisis Uttej Speech


MAA Crisis: మా ఎన్నికలు తెచ్చిన సంక్షోభం కొత్త కోణం తీసుకుంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పానెల్ తరుపున గెలిచిన అందరూ రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ఒక్కొరుగా మాట్లాడుతూ వస్తున్నారు. నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ నాన్ లోకల్ అనే పదానికి తీవ్ర అభ్యంతరం చెప్పారు.  ”సినిమా అన్న పదమే లోకల్ కాదు. అటువంటిది మా లో లోకల్ నాన్ లోకల్ అనే తేడా తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ కి మా అనేది ఎలా ఉండాలో తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి మా లో అందరూ బావుండాలని నిలబడ్డారు ప్రకాష్ రాజ్. నరేష్ ప్రవర్తన సరిలేదు. ఎన్నికల రోజు నరేష్ అమ్మల పై బూతులు తిట్టారు. మా ఆఫీసులోకి ప్రవేశించాలంటే సభ్యులు థంబ్ ఇంప్రెషన్ వేయాల్సిన పరిస్థితి. చిరంజీవిని లెక్కలు తప్పున్నాయని చెప్పిన నరేష్ అన్నారు. ఇలా ఎన్నో జరిగాయి. పోలింగ్ రోజు బరికేడ్స్ పెట్టారు. యుద్ధ వాతావరణం ఎన్నికల రోజు సృష్టించారు. గతం నుంచి కూడా నరేష్ తీరు సరిగా లేదు. మొదటి నుంచీ వేర్పాటు వాదం తెచ్చారు. 30 ఏళ్లుగా బెనర్జీని చూస్తున్నాను. ఎప్పుడూ కన్నీళ్లు చూడలేదు. ఆయనను కించ పరిచారు. ఆయన కంట నీరు పెట్టారు. ” అంటూ ఆవేశంగా అన్నారు.

నరేష్ గురించి మాట్లాడుతూ.. మా లో నేను ఈసీ మెంబర్ గా ఉన్నాను. నా భార్య చనిపోయింది. కానీ, మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కనీసం పలకరించలేదు. మానవత్వం లేని నరేష్ మా ప్రస్తుత పరిస్థితికి కారణం అంటూ ఉత్తేజ్ నరేష్ పై విరుచుకుపడ్డారు.

విష్ణు అన్నా.. నీవు మా ను నడపగలవు. తిరుపతిలో పెద్ద విశ్వవిద్యాలయం నడుపుతున్నావు. నీకు మా నడపడం పెద్ద కష్టం కాదు. నువ్వు నడిపించగలవు విష్ణు అన్న అంటూ ముగించారు.

ఇవి కూడా చదవండి: Tanish: ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్

Maa Crisis: కంటతడి పెట్టిన బెనర్జీ.. మూడు రోజులుగా నిద్రలేదు అంటూ వ్యాఖ్యలు!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu