Love Today: మరో రికార్డు సొంతం చేసుకున్న లవ్ టు డే.. టీవీలోనూ సత్తా చాటిన మూవీ..
హిట్ సినిమా తీయాలంటే వందల కోట్లు అవసరం లేదని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇలా సంచలనం సృష్టించిన సినిమాల్లో లవ్ టుడే మూవీ ఒకటి. తమిళ్ మూవీగా వచ్చిన లవ్ టు డే సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా..
రీసెంట్ డేస్ లో చిన్న సినిమాగా మంచి మంచి అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కథలో బలముంటే చాలు ప్రేక్షకులను సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. హిట్ సినిమా తీయాలంటే వందల కోట్లు అవసరం లేదని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇలా సంచలనం సృష్టించిన సినిమాల్లో లవ్ టుడే మూవీ ఒకటి. తమిళ్ మూవీగా వచ్చిన లవ్ టు డే సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఆ ఆ తర్వాత తెలుగులో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో ప్రేక్షకులు హిట్ చేశారు.
ఇక ఈ సినిమా ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను రాబట్టింది. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో యోగి బాబు, రాధిక కీలక పాత్రలు పోషించారు.
ఇవానా అందానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఏప్రిల్ 9న ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యింది. ఇక ఈ మూవీ 6.1 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.