Leo Movie : ఆసక్తికర సంఘటన.. థియేటర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ వీరాభిమాని
లియో సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి షో నుంచి లియో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర కటౌట్లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, డబ్బులు, డాన్స్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో లోకేష్ కానగరాజ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి.
స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి షో నుంచి లియో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర కటౌట్లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, డబ్బులు, డాన్స్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో లోకేష్ కానగరాజ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. గతంలో ఆయన తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన లియో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మాపొటి రోజే లియో సినిమా దాదాపు 150 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తోంది.
కేవలం తెలుగులు రాష్ట్రాల్లోనే 16 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ సినిమాకు తెలుగులో ఈ రేంజ్ ఓపినింగ్స్ రావడం ఇదే తొలిసారి. అంతే కాదు చాలా ఏరియాల్లో లియో సినిమా రికార్డ్ కలెక్షన్స్ వసూల్ చేసింది. ఇదిలా ఉంటే లియో సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు పోటెత్తుతున్నారు.
ఇప్పటికే అభిమానుల ధాటికి తమిళనాడులో పలు థియేటర్స్ ధ్వంసం అయ్యాయి కూడా.. ఇదిలా ఉంటే లియో థియేటర్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లియో సినిమా రిలీజ్ సాక్షిగా ఓ అభిమాని థియేటర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. పుదుకోటైకి చెందిన వెంకటేష్ అనే అభిమాని తనకు తల్లిదండ్రులు లేరని అన్ని తనకు దళపతి విజయే అని ఏకంగా థియేటర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
In #Pudukkottai a couple exchanged their engagement ring and put Maalai on each other in front of #Leo in the morning show. @xpresstn #VijayThalapathy #VijayFans #LeoMovie #wedding pic.twitter.com/OsZMrh7iYm
— Iniya Nandan (@Iniyanandan25) October 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి