సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్.. చనిపోతూ ఆస్తులు పేదలకు రాసిచ్చిన హీరోయిన్
అలనాటి అద్భుత నటి ఈ హీరోయిన్ కానీ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. బాలీవుడ్ చిత్రాలలో బాల నటిగా అడుగుపెట్టి, ఆపై దక్షిణాది సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రజినీకాంత్‌కు తొలి చిత్రంలో జోడీగా నటించి, ఆ తర్వాత ఆయన తల్లిగా కూడా నటించి షాక్ ఇచ్చారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన అలనాటి నటి శ్రీవిద్య. సినిమాల్లో స్టార్ గా రాణించిన ఆమె తెరపై ఎంతటి వైభవాన్ని చూసిందో, తెరవెనుక అంతకు మించిన కష్టాలను, విషాదాలను చూసింది. నటిగా అశేష కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం నిరంతరం సవాళ్లను ఎదుర్కొన్నారు. 1953 జులై 24న మద్రాస్‌లో కళల కుటుంబంలో జన్మించిన శ్రీవిద్యకు కళా నేపథ్యం పుట్టుకతోనే వచ్చింది. ఆమె తండ్రి ఆర్. కృష్ణమూర్తి తమిళ కమెడియన్ కాగా, తల్లి ఎం.ఎల్. వసంతకుమారి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. అయితే, ఆమె పుట్టిన కొద్ది కాలానికే తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో చిన్న వయసులోనే శ్రీవిద్యకు కుటుంబ బాధ్యతలు భుజాన పడ్డాయి. నటనతో పాటు భరతనాట్యం, సంగీతంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉండేది. సినిమా రంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలోనే కమల్ హాసన్‌తో ఆమెకు ప్రేమాయణం నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వారి బంధం పెళ్లి వరకు వెళ్తుందని భావించినా, అనివార్య కారణాలతో అది సాకారం కాలేదు.
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
ఆ తర్వాత 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ను శ్రీవిద్య వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం మతం కూడా మార్చుకున్నారని, సినిమాలకు దూరంగా ఉన్నారని చెబుతారు. అయితే, ఈ వివాహం ఆమె వ్యక్తిగత జీవితంలో మరిన్ని సమస్యలను సృష్టించింది. ఆస్తుల వివాదాలు, వేధింపులు వంటి ఆరోపణల నేపథ్యంలో 1980లో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, దాదాపు 14 ఏళ్ల అనంతరం తన ఆస్తులపై హక్కులను తిరిగి పొందినట్లు కథనాలు వచ్చాయి.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
శ్రీవిద్య 1975లో కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ ఆమె కెరీర్‌కు మలుపునిచ్చింది. ఈ చిత్రంలో ఆమె కమల్ హాసన్, రజినీకాంత్‌లతో కలిసి నటించారు. ఇది రజినీకాంత్‌కు తొలి సినిమా కావడం విశేషం. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె, ఆ తర్వాత తల్లి, అక్క వంటి విభిన్నమైన పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. దక్షిణ భారత భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటించి, నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగారు. ఒకప్పుడు రజినీకాంత్‌కు జోడీగా నటించిన శ్రీవిద్య, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి చిత్రంలో ఆయనకు తల్లిగా కనిపించి, తన నటనా పరిధిని చాటుకున్నారు. తెలుగులో తాత మనవడుతో పరిచయమైన ఆమె, తూర్పు పడమర, ప్రేమాభిషేకం, ధర్మచక్రం, ప్రేమ దేశం వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. శ్రీవిద్య జీవితంలోని చివరి అధ్యాయం ఆమె గొప్ప మనసుకు నిదర్శనం. 2003లో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ, తన ఆస్తులను సమాజ సేవకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. మరణానికి కొన్ని నెలల ముందు, 2006 ఆగస్టు 17న ఆమె విల్లు రాశారు. ఆ విల్లులో తన ఆస్తులను పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత సంగీత, నృత్య పాఠశాలలు ఏర్పాటు చేయడానికి, స్కాలర్‌షిప్‌లు అందించడానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ కళాకారులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని పేర్కొన్నారు. 2006 అక్టోబర్ 19న శ్రీవిద్య కన్నుమూశారు.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




