AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K. Viswanath : తెలుగు సినిమాకు గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్

సినీ వినీలాకాశంలో ఆయనో ధ్రువతార.. కోట్లాది గుండెలను తన సినిమాలతో అలరించిన  గొప్ప దర్శకుడు. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి . ఆయనే కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ .

K. Viswanath : తెలుగు సినిమాకు గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2021 | 8:14 AM

Share

K. Viswanath : సినీ వినీలాకాశంలో ఆయనో ధ్రువతార.. కోట్లాది గుండెలను తన సినిమాలతో అలరించిన గొప్ప దర్శకుడు. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి. ఆయనే కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. నేడు ఈ దిగ్గజ దర్శకుడి జన్మదినం. కె.విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు అనే గ్రామంలో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊళ్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూ కాలేజీ, ఎ.సి కాలేజీలోనూ జరిగింది. విశ్వనాథ్ బీఎస్సీ పూర్తిచేశారు. కె.విశ్వనాథ్ సతీమణి పేరు జయలక్ష్మి.

చెన్నైలోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడి గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు విశ్వనాథ్. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పని చేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ నిర్మించిన ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారట. అలా ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు.

పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ‘శంకరాభరణం’ సినిమాలో ఆయన చూపించిన తీరు వర్ణనాతీతం..జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి నిలిచిపోయింది. సహజత్వం ఉట్టిపడే నటన, సంగీతం, కథాంశాలనే ఊపిరిగా ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆణిముత్యాలు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘సిరివెన్నెల’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరి మువ్వ’, ‘స్వర్ణకమలం’,‘శుభసంకల్పం’, ‘ఆపద్భాందవుడు’ సినిమాలు కె.విశ్వనాథ్ దర్శకత్వానికి మచ్చుతునకలు. కేవలం దర్శకుడిగానే కాదు నటుడిగాను విశ్వనాథ్ అలరించారు. హీరో హీరోయిన్ల తండ్రి పాత్రలో ఆయన చాలా సినిమాల్లో నటించారు. ఇక ఆయన సినిమాలోని పాటలు శ్రవణారమ్యంగా ఉంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రిని కళామ్మతల్లికి పరిచయం చేసారు కళాతపస్వి. వేటూరి కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు కళాతపస్వి సినిమాల్లో ప్రాణంగా నిలిచాయి. తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి  కె.విశ్వనాథ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : శరవేగంగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ షూటింగ్.. హిందీ వర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్న క్రేజీ హీరో..?