Aadi Keshava: ఆదికేశవ నుంచి ‘లీలమ్మో’ సాంగ్ రిలీజ్.. శ్రీలీల, వైష్ణవ్ మాస్ స్టెప్పులు అదుర్స్..
ఇక ఈ మూవీలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ మెప్పించాయి. ఇటీవల ఈ సినిమాలోని మూడో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదికేశవ చిత్రంలోని మూడో సాంగ్ లీలమ్మో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మరోసారి తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో కట్టిపడేసింది శ్రీలీల.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ఆదికేశవ మూవీ చేస్తున్నారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ మెప్పించాయి. ఇటీవల ఈ సినిమాలోని మూడో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదికేశవ చిత్రంలోని మూడో సాంగ్ లీలమ్మో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మరోసారి తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో కట్టిపడేసింది శ్రీలీల.
ఈ పోటకు శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేయగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. నకష్ అజీజ్, ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ కల్సి చేసిన ఎనర్జీటిక్ మాస్ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట దూసుకెళ్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 10న రిలీజ్ కానుంది.
Unleashing the MASS BLAST with an Explosive ENERGY of #PanjaVaisshnavTej & @sreeleela14!💥#Leelammo song is out now! 🕺💃
A @gvprakash Musical 🥁🎵 🎤 @AzizNakash @IndravathiChauh ✍️ @LyricsShyam#Aadikeshava #JojuGeorge @aparnaDasss… pic.twitter.com/QCCAKjZCck
— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2023
ఇదిలా ఉంటే.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఉప్పెన సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈహీరో.. ఆ తర్వాత మాత్రం సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. ఉప్పెన తర్వాత నటించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు వైష్ణవ్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
MASS song of the year needs a MASS Celebration! 😎🕺#Aadikeshava 3rd single ~ #Leelammo Song Launch Event TODAY @ Park Hyatt – Hyd, from 3:00 PM onwards! 🤩💃
Promo – https://t.co/osH3dO4PdL
A @gvprakash Musical 🥁🎵 🎤 @AzizNakash @IndravathiChauh ✍️ @LyricsShyam… pic.twitter.com/cYwl9go0j9
— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.