Mahesh Babu: షూరూ అయిన మహేష్ మూవీ షూటింగ్.. వైరల్‌గా మారిన లీక్ ఫోటో
ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్.

సూపర్ మహేష్ బాబు సినిమా కోసం అయన ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ నెల 18న తిరిగి ప్రారంభం అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం యాక్షన్స్ సీన్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. లొకేషన్ లో మహేష్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో మాట్లాడుతున్న ఫోటో ఒకటి లీక్ అయ్యింది. రెండు వారాల పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు.
మహేష్ తో మొదటి యాక్షన్ ఎంటర్ టైనర్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కథలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఎంపిక చేశారు. పూజ తోపాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.





Mahesh Babu




