నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు.. నా పై దాడి చేశారు.. రాజ్ తరుణ్ పేరెంట్స్ పై లావణ్య కామెంట్స్

రాజ్ తరుణ్, లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంత కాలంగా ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి సౌండ్ వినిపించలేదు. మళ్లీ ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్‌తో ఈ వివాదం సంచలనం రేపుతుంది. ప్రస్తుతం లావణ్య ఉంటోన్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్‌తో సహా వెళ్లడంతో ఉద్రిక్త నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు.. నా పై దాడి చేశారు.. రాజ్ తరుణ్ పేరెంట్స్ పై లావణ్య కామెంట్స్
Raj Tarun, Lavanya

Updated on: Apr 17, 2025 | 8:12 AM

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, లావణ్య మధ్య గొడవతో రచ్చ రాజుకుంది. ప్రస్తుతం లావణ్య ఉంటోన్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్‌తో సహా వెళ్లడంతో ఉద్రిక్త నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇష్యూపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ పేరెంట్స్ పదిహేను మందితో వచ్చి ఇంటిని ధ్వంసం చేసారని చెబుతోంది. అలాగే అసభ్యంగా తన ప్రైవేట్ పార్ట్స్ పై తాకారు అని తెలిపింది. బ్యాట్ తీసుకొని తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారని ఆరోపించింది లావణ్య.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్‌తరుణ్‌ది అంటున్నారు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు. తమ కుమారుడు కట్టిన ఇల్లు ఉన్నాక తాము బయట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అంతేకాక ఇంట్లో సాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని లావణ్య గతంలో చేసిన ఆరోపణలతో మొదలైన వివాదంపై ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు నడిచాయి. కొన్నాళ్లు అనేక ట్విస్టులతో పెద్ద రచ్చ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్‌కు క్షమాపణ చెబుతూ.. అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాని లావణ్య చెప్పింది. ఇక రాజ్‌ తరుణ్‌, లావణ్య వివాదానికి ఫుల్ స్టాప్‌ పడిందని భావిస్తున్న క్రమంలో ఈ గొడవ జరిగింది. లావణ్య ప్రస్తుతం కోకాపేట్ లోని ఓ ఇంట్లోనే ఉంటుంది. రాజ్‌ తరుణ్‌, లావణ్య మధ్య గొడవ జరుగుతున్న టైమ్‌లో కూడా ఆమె ఆ ఇంట్లోనే ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇల్లు తమదని ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ రచ్చ రాజుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.