Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘ఆదిపురుష్’ నుంచి లేటెస్ట్ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీసే ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగాగడుపుతున్నాడు.

Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆదిపురుష్ నుంచి లేటెస్ట్ అప్డేట్
Prabhas

Updated on: Jul 16, 2022 | 6:11 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీసే ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగాగడుపుతున్నాడు. కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కే , సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఇవే కాకుండా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు ప్రభాస్. వీటిలో ఆదిపురుష్ పై ప్రభాస్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా అప్డేస్ట్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం మేరకు ఆదిపురుష్ ఐమ్యాక్స్ 3డి ఫార్మాట్ లో విడుదల కానుందని తెలుస్తోంది. అతి త్వరలో చిత్ర బృందం నుండి దీనిపై ప్రకటన వెలువడనుంది. 12 జనవరి 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. సన్నీ సింగ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి