SP Balasubrahmanyam: నేను పాడిన వింటే నాకే చిరాకు వచ్చేది.. ఎస్పీ బాలు చెప్పిన మాటలు..

దివంగత గాన గాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో వేలాది పాటలు పాడారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ బాలు తన గాన ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలి నాళ్ల పాటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, పి. సుశీల గారి వంటి వారి నుంచి నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు.

SP Balasubrahmanyam: నేను పాడిన వింటే నాకే చిరాకు వచ్చేది.. ఎస్పీ బాలు చెప్పిన మాటలు..
Sp Balasubrahmanyam

Updated on: Jan 19, 2026 | 1:12 PM

గాన గాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాటలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఘంటసాల తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కుగా మారారు ఎస్పీ బాలు. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూనే సన్నివేశ బలానికి తగ్గట్టుగా నటనను తన గాత్రంతో ప్రకటించగల గాయకుడు ఎస్పీ బాలు. భారతీయ సినిమా ప్రపంచంలో వేలాదికి పైగా పాటలు పాడి సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ.. తన సుదీర్ఘ గాన ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తొలి నాళ్ల పాటలను విన్నప్పుడు కొంత చికాకు కలుగుతుందని, అయినా పరిశ్రమ తనకు అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పి. సుశీల గారి వంటి మహానీయుల నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని ఎస్పీబీ గుర్తు చేసుకున్నారు. ‘జా’, ‘చా’ వంటి అక్షరాలను పలికేటప్పుడు దవడను కదల్చడం, ఒక అక్షరానికి ఎంత ‘త్రో’ ఇస్తే రికార్డ్ అవుతుందో వంటి సూక్ష్మ విషయాలను ఆవిడ అనుభవం ద్వారా తెలుసుకున్నారని, వాటిని తాను కూడా గ్రహించానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

తాను పాటలు పాడే ముందు సాహిత్యం, క్యాసెట్ పంపించమని అడుగుతున్నానని ఎస్పీబీ పేర్కొన్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయని వివరించారు: ఒకటి, ‘అపభ్రంశమైన’ పాటలను పాడటం ఇష్టం లేక. రెండు, తాను పాడలేని శ్రుతిలో చేసి ఉంటారేమోనని. ‘అపభ్రంశం’ అంటే తన దృష్టిలో ‘గ్రామర్ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాటలు రాయడం’ అని స్పష్టం చేశారు. అసలు సందర్భం లేకుండా ఎవరో పెద్దవాళ్లు రాసిన పడికట్టు మాటలను ఇరికించేయడం కూడా ఇందులో భాగమేనని చెప్పారు. ఇప్పుడు మరోసారి బాలు మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు ఎస్పీ బాలు. శంకరాభరణం సినిమాతో ఆయన సినీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రానికి తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డ్ అందుకున్నారు. హిందీలో కమల్ హాసన్ నటించిన ఎక్ దూజేకే లియే సినిమాతో రెండోసారి జాతీయ అవార్డ్ అందుకున్నారు. సాగర సంగమం సినిమాలోని వేదం అణువణునా నాదం పాటకు మూడోసారి జాతీయ అవార్డ్ అందుకున్నారు. చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలోని చెప్పాలని ఉంది పాటకు నాల్గోసారి ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..