Lakshya Pre Release Event: ఘనంగా నాగ శౌర్య “లక్ష్య” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరంటే..
కుర్ర హీరో నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు
Lakshya Pre Release Event: కుర్ర హీరో నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రయోగం చేసేందుకు రాబోతోన్నారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. అలాగే పుల్లెల గోపీచంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ అందరినీ ఆకట్టుకుంటుంది. విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :