
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, ప్రముఖ యోగా ట్రైనర్ రూహీ నాజ్ హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ తారలకు యోగా పాఠాలు నేర్పిన ఆమె ఇక లేరంటూ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న రూహీ గురువారం (ఫిబ్రవరి 15) కన్నుమూశారు. దీంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సెంథిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మంచు లక్ష్మి, ఛార్మీ కౌర్.. రూహీతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె మరణ వార్త విని షాక్‌కు గురయ్యామంటూ… ఈ వార్త అబద్ధమైతే బాగుండు అంటూ ఎమోషనల్ అయ్యారు.
మంచు లక్ష్మి.. రూహీతో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘రూహీ నుంచి నాకు అందిన ఆఖరి మెసేజ్ ఇదే. ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్‌లు, కసరత్తులు చేసేవాళ్లం. అలాగే దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. లైఫ్‌లో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు రూమీ. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ ఫ్రెండ్ లక్ష్మి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది లక్ష్మి.
ఇక ఛార్మీ రూహీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.. ‘ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ షేర్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇప్పటికీ నేను షాక్‌లోనే ఉన్నాను. అసలు మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న ఈ వార్త అబద్ధమైతే ఎంతో బాగుండనిపిస్తోంది. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మరింత ధైర్యమివ్వాలి’ అని ఛార్మీ.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.