Brahmastra: బ్రహ్మాస్త్ర మూవీ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటోన్న రణబీర్- అలియా కెమిస్ట్రీ
బాలీవుడ్ నుంచి వస్తోన్న బడా మూవీస్ లో బ్రహ్మాస్త ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ నుంచి వస్తోన్న బడా మూవీస్ లో బ్రహ్మాస్త(Brahmastra)ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేయనున్నారు. ఇందులో అమితాబ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ ఇన్వాల్ అవ్వడంతో ఈ సినిమాకు తెలుగులో మైలేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా బ్రహ్మాస్త మూవీ నుంచి కుంకుమమాల అనే పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. సిద్ద్ శ్రీరామ్ ఈ మోలోడీ పాటని ఆలపించగా ..చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. పాట ఆద్యంతం మోలోడీ వేవ్ లో వెళ్తుంది. అలియా..రణబీర్ మాధ్యనే పాట సాగుతుంది. మెలోడీ ప్రియలకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.