Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?
తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తోన్న ఓ స్టార్ హీరోయిన్ శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను పెళ్లిపీటలెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో తన ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను పెళ్లిపీటలెక్కనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తనప్రియుడు ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో నుపుర్‌కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నుపుర్ సనన్ పెళ్లి జనవరి 11న జరగనుంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోట వేదికగా ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వివాహానంతరం ముంబైలో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని సమాచారం.
తెలుగు సినిమాతో కెరీర్ ఆరంభించి..
కాగా కృతి సనన్ లాగే నుపుర్ సనన్ కూడా మొదట తెలుగు సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది నుపుర్ సనన్. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమాలోనూ కథానాయికగా ఛాన్స్ వచ్చింది. షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే ఏమైందో తెలియదు కానీ మధ్యలోనే ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ పెద్దగా సినిమాలు చేయకపోయినా ఆల్బమ్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు, మూడు మూడు హిందీ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.
నుపుర్ సనన్ ఎంగేజ్మెంట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక నుపుర్ సనన్ కు కాబోయే భర్త స్టెబిన్ బెన్ విషయానికి వస్తే.. ఇతనొక ప్రముఖ సింగర్. బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహమని తెలుస్తోంది.
సోదరి కృతి సనన్ తో నుపుర్ సనన్ డ్యాన్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




