ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలోకి ఎంట్రీఇచ్చింది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty). తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. యంగ్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం.. ఇటీవలే ఈ బ్యూటీకి ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. రీసెంట్ గా కృతి నటించిన వారియర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్లకు మాత్రం కొదవలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ఫోటోలు, టీజర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడి అలరించింది.
కృతి శెట్టి మాట్లాడుతూ.. నితిన్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్ గారి నుండి ప్రేక్షకులు క్లాస్, మాస్ ఎంటర్ టైమెంట్ ఆశించవచ్చు. నితిన్ గారి లాంటి ఫ్రెండ్ వుండటం అదృష్టంగా భావిస్తున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో స్వాతి లాంటి నేటివ్ టచ్ వున్న పాత్రని ఇచ్చిన దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు. ఆయనతో మరోసారి వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు.సుధాకర్ గారు, నిఖితా గారి నిర్మాణంలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. హరి, రాజ్ కుమార్ గారికి థాంక్స్. మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో పని చేసిన అన్ని విభాగాలకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది.