Krithi Shetty: బెబమ్మకు ఆగస్టు నెలలో అగ్నిపరీక్ష.. కృతిశెట్టిని ఆ హీరో గట్టెక్కిస్తాడా.?

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఎగిసిపడిన అందం కృతి శెట్టి(Krithi Shetty).కలువలాంటి కళ్లు, తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ అమ్మడు.

Krithi Shetty: బెబమ్మకు ఆగస్టు నెలలో అగ్నిపరీక్ష.. కృతిశెట్టిని ఆ హీరో గట్టెక్కిస్తాడా.?
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2022 | 12:38 PM

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఎగిసిపడిన అందం కృతి శెట్టి(Krithi Shetty).కలువలాంటి కళ్లు,   తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ అమ్మడు. అందం, అమాయకత్వం కలగలిపిన కృతి నటనతోనూ ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడికి వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి. యంగ్ హీరోలంతా ఈ అమ్మడినే మొదటి ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడికి ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. ఇటీవల ఈ చిన్నది ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలో నటించింది. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రెండు భాషల్లో సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టింది కృతి.

అయితే ఈ అమ్మడుకు ఆగస్టులో అగ్నిపరీక్ష అనే చెప్పాలి. తొలి ఫ్లాప్‌తో నిరాశలో ఉన్నకృతి నెక్స్ట్ యంగ్ హీరో నితిన్ తో మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు,ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అటు నితిన్ కూడా ఈ సినిమా పై ధీమాగా ఉన్నాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ చెప్తుంది. అలాగే కృతి నటిస్తున్న మరో సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఆగస్టు నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ అమ్మడు ఈ రెండు సినిమాలు ఎలాగైనా హిట్ అవ్వాలని కోరుకుంటుంది. ఒకవేళ సినిమాల రిజల్ట్ తారుమారు అయ్యిందంటే.. కృతి కెరీర్ డల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అటు తమిళ్ లోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దర్శకుడు బాల, సూర్య కాంబినేషన్ లో వస్తున్న ‘అచలుడు’లో కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మరి ఆగస్టు నెల ఈ అమ్మడిని గట్టెక్కిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్