Sitara Ghattamaneni: తాత మరణంతో తల్లడిల్లిపోతున్న సితార.. ఇన్‌స్టాలో కన్నీరు పెట్టించే పోస్ట్..
సూపర్‌స్టార్ కృష్ణకు తెలుగు జనం అశృనయనాలతో నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన ఇక లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని కృష్ణ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

కృష్ణ ముద్దల కొడుకు మహేష్ బాబు…నిశ్చలంగా ఉన్న తండ్రి పార్థివ దేహాన్ని చూసి… కన్నీటి పర్యంతం అయ్యారు. విషన్నవదనంతో దుఃఖాన్ని దిగమింగుకొని…అభిమానులను చూసి భారమైన గుండెలను చిక్కబట్టకున్నారు. అటు మనవడు, మనవరాలు గౌతమ్ కృష్ణ, సితార- తాతను కడసారి చూసి తల్లడిల్లిపోయారు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తాతగారి పార్థివ దేహంపై పూలుచల్లి అశృనయనాలతో నమస్కారం చేశారు. తాత మరణంతో తీవ్ర భావోద్వాగానికి లోనైంది మహేశ్ బాబు కూతురు సితార. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్టింగ్.. ఆమె మాటల్లో చూస్తే.. “ఇకపై వారాంతపు లంచ్ ఎప్పటిలా ఉండదు. మీ దగ్గర నేను చాలా విలువలు నేర్చుకున్నాను. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి. ఆ జ్ఞాపకాలన్నీ మరిచిపోలేను. మీరే అసలైన హీరో. మీరు గర్వపడేలా నేను తయారవుతాను. మీరు లేకపోవడం నాకు తీరని లోటు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను తాత గారు” అంటూ ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది సితార.
View this post on Instagram
తీవ్ర విషాదంలో కృష్ణ అభిమానులు
తెలుగు సినీ పరిశ్రమకు చుక్కానిగా నిలిచిన ఓ ధృవతార నేలరాలింది. తెలుగు సినీ జగత్తుకి దిశానిర్దేశం చేసిన సాహస నటుడికి యావత్ తెలుగు సమాజం గుండెలోతుల్లోంచి నివాళ్ళర్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి తమ అభిమాన నటుడి కడసారి చూపుకోసం తరలివచ్చింది. అశేష ప్రజానీకం. సుదీర్ఘకాలంపాటు అవిశ్రాంతంగా తెలుగు చిత్రసీమ అభివృద్ధికోసం అహరహం పరిశ్రమించిన అలుపెరుగని నిత్య శ్రామికుడికి నివాళులర్పించారు.
అశేషజన అభిమాన నటుడు, వెండితెరను ఏలిన అందగాడు, వెన్నలాంటి మనసున్న మంచి మనీషి…నటుడిగానే కాదు…నిజజీవితంలోనూ నిఖార్సైన హీరో కృష్ణకు తెలుగు జనం అశృనయనాలతో నీరాజనాలు పలుకుతున్నారు. దశాబ్దాలపాటు లక్షలాది ప్రేక్షకుల హృదిలో నిలిచివెలిగిన ధృవతార ఇక లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని కృష్ణ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
కృష్ణ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించిన సీఎం జగన్
సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవదేహానికి నివాళులర్పించారు ఏపీ సీఎం జగన్. పూల దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతోపాటు మంత్రులు, ఎంపీలు కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. మహేష్‌బాబును ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. గల్లా జయదేవ్‌తోనూ మాట్లాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
