Director Prashanth Neel: ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు నల్ల రంగులో ఉంటాయో తెలుసా.. ? రీజన్ ఇదే..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాలపై భారీ అంచనాలు ఉంటున్నాయి. కానీ ఆయన సినిమాలు ఎక్కువగా డార్క్ గా ఉంటాయని గమనించారా.. ? అందుకు ఓ రీజన్ కూడా ఉందట.

Director Prashanth Neel: ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు నల్ల రంగులో ఉంటాయో తెలుసా.. ? రీజన్ ఇదే..
Prashanth Neel, Salaar

Updated on: Feb 08, 2025 | 12:35 PM

పాన్ ఇండియన్ సౌత్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 1,2 సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. గతేడాది సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. అయితే ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలన్నీ డార్క్ గా ఉంటాయి. ఆయన సినిమాల థీమ్ ఎప్పుడూ డార్క్ నెస్ గా ఉంటాయి. అందరి దర్శకుల మాదిరిగా కాకుండా కేవలం డార్క్ షెడ్ మాత్రమే ఎంచుకోవడానికి ఓ రీజన్ కూడా ఉందట. గతంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలన్నీ డార్క్ షెడ్ లో ఉంటాయి. కేజీఎఫ్ 2 పూర్తిగా డార్క్ షేడ్ లో ఉంది. అలాగే సలార్ సినిమా సైతం అదే విధంగా డార్క్ షేడ్ లో ఉంది. ఇందుకు కారణం ప్రశాంత్ నీల్ కు ఓసిడి ఉందట. అందుకే ఆయన ఒకే తరహా సినిమా తీస్తున్నారు. తనకు ఓసీడీ కారణంగా రంగు రంగుల చొక్కాలు ధరించడం నచ్చదని.. తన మనసులో ఏముందో అదే తెరపై కనిపిస్తుందని.. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. OCD అంటే.. అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్‌. ఈ సమస్య ఉన్నవారికి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. అందుకే వారు ఒకే రకమైన పనులు.. ఒకే రకమైన పద్ధతి ఫాలో అవుతుంటారు.

సలార్ సినిమా సమయంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఓ కుర్తా తెచ్చారని.. అది నచ్చకపోవడంతో మళ్లీ నలుపు రంగులోని కుర్తా ఉపయోగించినట్లు తెలిపారు. త్వరలోనే ఆయన సలార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ మూవీ తెరకెక్కించనున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన