AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. భర్తపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్స్ గా వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఒకప్పుడు సినీప్రియులను ఆకట్టుకున్నారు. కానీ వెండితెరపై అలరించిన ఆ తారల వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. అందులో ఈ హీరోయిన్ సైతం ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. కానీ భర్త చేతిలో దారుణంగా హింసకు గురైంది. ఎవరో తెలుసా..

Tollywood: హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. భర్తపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Karishma Kapoor
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 26, 2024 | 8:00 AM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా భర్త చేతిలోనే దారుణంగా మోసపోయింది. నిత్యం భర్తతో వేధింపులకు గురైంది. చివరకు తన భర్తతో విడాకుల తీసుకుని వివాహ బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ కరిష్మా కపూర్. అప్పట్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కరిష్మా.. 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2016లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. డివోర్స్ అనంతరం ఒకరిపై మరొకరు షాకింగ్ కామెంట్స్ చేసుకున్నారు. ముఖ్యంగా కరిష్మా తన భర్త పై సంచలన ఆరోపణలు చేసింది. కరిష్మా తన విడాకుల పిటిషన్‌లో సంజయ్‌ను గృహహింసకు గురిచేశాడని ఆరోపించింది, వారి హనీమూన్ సమయంలో సంజయ్ తన స్నేహితులతో పడుకోమని బలవంతం చేసాడని తెలిపింది.

అంతేకాదు.. తనను తన భర్త ఎన్నోసార్లు కొట్టాడని.. నిత్యం దారణంగా హింసించారని.. ఆమె అత్త సైతం తనపై దాడి చేసిందని తెలిపింది. ముఖ్యంగా కరిష్మా గర్భధారణ సమయంలో ఆమె అత్తగారు హింసించారని పిటిషన్ లో పేర్కొంది. అయితే కరిష్మా చేసిన ఆరోపణలు అవాస్తవమని మరో పిటిషన్ దాఖలు చేశాడు సంజయ్. చివరకు వీరిద్దరికి 2016లో విడాకులు మంజూరు అయ్యాయి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.