Cinema: ఇదెందీ మావ.. కలెక్షన్స్ 200 కోట్లు.. అయినా అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఎందుకంటే..

ఈమధ్య కాలంలో పాన్ ఇండియా స్తాయిలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు మేకర్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాగా.. మరికొన్ని మూవీస్ మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్.. రూ.200 కోట్ల కలెక్షన్స్.. అయినా అట్టర్ ప్లాప్.

Cinema: ఇదెందీ మావ.. కలెక్షన్స్ 200 కోట్లు.. అయినా అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఎందుకంటే..
Tubelight

Updated on: Jul 22, 2025 | 7:56 AM

సాధారణంగా సినీరంగంలో ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. మూవీ విడుదలకు ముందే థియేటర్లలో భారీ కటౌట్స్, హాడావిడి మాములుగా ఉండదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోకు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ ఒక్క సినిమా మాత్రం రూ.200 కలెక్షన్స్ రాబట్టింది. అయినప్పటికీ థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? ఆ హీరో ఎవరో తెలుసా.. ? ఆ హీరో మరెవరో కాదండి.. బీటౌన్ స్టార్ సల్మాన్ ఖాన్.

సల్మాన్ ఖాన్ సినిమాలు హిట్టు అయినా, ప్లాప్ అయినా అది అతడి స్టార్ డమ్ ను ఏమాత్రం ప్రభావితం చేయదు. కానీ ఆయన నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఆ మూవీ బడ్జెట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువగా నిర్మాతలు నష్టాలే మిగిలాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అతడి సోదరుడు సోహైల్ ఖాన్ సైతం ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా ట్యూబ్ లైట్. ఈ మూవీ 2017 జూన్ 23న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో ఈ చిత్రంలో ఓం పురి, అమిత్ సింగ్, మొహమ్మద్ జీషన్ అయూబ్, యశ్‌పాల్ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.

దాదాపు 2 గంటల 50 నిమిషాల నిడివి గల ఈ సినిమా భారతదేశంలో రూ.119 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.212 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ వావ్ అనిపించినప్పటికీ.. నిర్మాతలకు ఏమాత్రం లాభాలు రాలేదు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.. ఫస్ట్ డే రూ.21.15 కోట్లు.. వీకెండ్ లో రూ.64.77 కోట్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి. అయితే అంచనాలతో పోలిస్తే ఈ సినిమాకు తక్కువగానే వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

1962 ఇండో చైనా యుద్ధ నేపథ్యంలో నమ్మకం అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసించే లక్ష్మణ్ (సల్మాన్ ఖాన్ )స్టోరీ ఇది. ఇందులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్.. ఇన్నాళ్లు యాక్షన్ హీరోగా కనిపించిన సల్మాన్ ఈ సినిమాలో పూర్తిగా అమాయకుడిగా కనిపించడమే. సల్మాన్ అలా కనిపించడం ఫ్యాన్స్ అసలు తీసుకోలేకపోయారు. దీంతో మూవీ బోరింగ్ అనే టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చినప్పిటికీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..