Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

హారర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అనుక్షణం భయం పుట్టించే చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఓటీటీ ప్లాట్ పామ్స్ పై ఈ జానర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా సరే భయానక కథలకు ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..
1920 Evil Returns

Updated on: Jul 24, 2025 | 10:43 AM

సినీ ప్రపంచంలో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ మీకు తెలుసా.. ? 13 ఏళ్ల క్రితం విడుదలైన ఓ సినిమా ఇప్పటికీ జనాలను భయపెడుతుంది. మిస్టరీ, సస్పెన్స్ తో సాగే ఈ మూవీ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. హారర్ సినిమాలు చూడాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే ఆద్యంతం భయం, ట్విస్టులు, సస్పెన్స్ తో ఆకట్టుకుంటుంది. అదే ‘1920: ఈవిల్ రిటర్న్స్’ . ఇప్పటివరకు విడుదలైన హారర్ సినిమాల జాబితాలో ఈ చిత్రం అగ్రస్థానంలో ఉంది. ఎందుకో తెలుసుకుందాం.

‘1920: ఈవిల్ రిటర్న్స్’ ఇది 2012 లో విడుదలైంది. ఈ సినిమా కథ మిమ్మల్ని 1920కు తీసుకెళ్తుంది. పాత రాజభవనంలో ఉండే రహస్య ఆత్మ.. ప్రేమకథ చుట్టూ సాగుతుంది. ఒక కవి.. ఒక రహస్య అమ్మాయి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఒక ఆత్మ జనాలను వెంటాడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కంచిన డైరెక్టర్ విక్రమ్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నటి టియా బాజ్ పాయ్ రహస్యమైన అమ్మాయి స్మృతి పాత్రలో భయం, అమాయకత్వం, అద్భుతమైన కలయికతో ఆకట్టుకుంది. ఇక విద్యా మాల్వాడే, శరద్ కేల్కర్ సహాయ పాత్రలలో కనిపించారు.

ఈ సినిమాలో ఆకస్మాత్తుగా వచ్చే భయాకన దృశ్యాలు వణుకుపుట్టిస్తాయి. ఇక నేపథ్య సంగీతం, కెమెరా పనితనం, యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. మొత్తం 90 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.280 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. దాదాపు 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాను చూసేందుకు జనాలు ఇప్పటికీ భయపడుతుంటారు.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..