Tollywood: ఆశా భోంస్లేతో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్..

లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలో ఉన్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అలాగే సింగర్ కూడా. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు సినిమాల ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఆశా భోంస్లేతో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్..
Shruti Haasan

Updated on: May 04, 2025 | 10:07 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను గమనించారు కదా.. అందులో సింగర్ ఆశా భోంస్లేతో కనిపిస్తున్న ఆ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. చేసిన మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోయింది. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్రుతి హాసన్. మూడు దశాబ్దాలకు పైగా భారతీయ చిత్ర పరిశ్రమను ఏలేస్తున్న కమల్ హాసన్ గారాలపట్టి . స్టార్ హీరో కూతురు అయినప్పటికీ సినీరంగంలో ఆమె ఎంట్రీ అంత సులభంగా జరగలేదు. కెరీర్ తొలినాళ్లల్లో సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటిగా మారింది.

ఒకప్పుడు శ్రుతి హాసన్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత ఆమెను ఐరెన్ లెగ్ అని విమర్శలు చేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 2011లో సిద్ధార్థ్ సరసన ‘అనగనగ ఓ ధీరుడు’ చిత్రంలో శృతి హాసన్ తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సిద్ధార్ తో కలిసి ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో ఆమెను ఐరెన్ లెగ్ అన్నారు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

గబ్బర్ సింగ్ చిత్రానికి గాను శ్రుతి హాసన్ తన మొదటి SIIMA ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత శ్రుతి హాసన్ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయికగా మారింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. పైన కనిపిస్తున్న ఫోటో శ్రుతి హాసన్ స్కూల్ డేస్ సమయంలోనిది. శ్రుతి హాసన్ 1992లో తన తండ్రి కమల్ హాసన్ చిత్రం తేవర్ మగన్‌లో 6 సంవత్సరాల వయసులో పాడటం ప్రారంభించింది. ఐదు సంవత్సరాల తరువాత, 1997లో కమల్ బాలీవుడ్ చిత్రం చాచి 420 కోసం ఆదిత్య నారాయణ్‌తో కలిసి చుపాడి చుపాడి చాచి పాడింది. శ్రుతి హాసన్ ప్రస్తుతం ది ఎక్స్‌ట్రామెంటల్స్ అనే రాక్ బ్యాండ్‌లో సభ్యురాలు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..