Tollywood: 600 కోట్ల సినిమా తీసి చిన్న కారులో తిరుగుతున్న డైరెక్టర్.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు టాప్ డైరెక్టర్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విభిన్న ప్రయోగాలతో కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను తెరకెక్కిస్తూ తక్కువ సమయంలోనే సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలే రూ.600 కోట్లతో సినిమా రూపొందించి భారీ విజయాన్ని అందుకున్నాడు.

Tollywood: 600 కోట్ల సినిమా తీసి చిన్న కారులో తిరుగుతున్న డైరెక్టర్.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే..
Nag Ashwin

Updated on: Jul 19, 2025 | 1:31 PM

సాధారణంగా సినీరంగంలో ఏ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినప్పటికీ తమ టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు చాలామంది ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయిన వారి గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ కాదు.. కొన్ని సందర్భాల్లో మనం దర్శకనిర్మాతల గురించి సైతం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ డైరెక్టర్ ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు. కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు స్క్రీన్ రైటర్ గా, అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ పేరు మారుమోగింది. ఇక ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు కల్కి 2 ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది. అయితే రూ.600 కోట్లతో సినిమా తెరకెక్కించి కోట్లలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ చిన్న కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. ఆ కారు ధర కేవలం పది లక్షలు అని సమచారాం. దీంతో నాగ్ అశ్విన్ సింపుల్ లైఫ్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..