
2013లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఓ సినిమా. చిన్న చిత్రంగా అడియన్స్ ముందుకు వచ్చి సంచలనం సృష్టించింది. అంతేకాదు.. తక్కువ సమయంలోనే ఆ మూవీ ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. అయితే ఆ చిత్రాన్ని ముగ్గురు స్టార్స్ రిజెక్ట్ చేశారు. చివరకు ఓ యంగ్ హీరో ఆ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. కట్ చేస్తే ఆ మూవీ ఏకంగా 55 అవార్డులు గెలుచుకుంది. అందులో అతడి అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే భాగ్ మిల్కా భాగ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన మూవీ. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ రన్నర్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఇందులో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు.
అయితే ఈ సినిమాను ఫర్హాన్ అక్తర్ కంటే ముందు బీటౌన్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన అమిర్ ఖాన్, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ లకు వినిపించారు. కానీ ఈ ముగ్గురు బయోపిక్ సినిమాను చేసేందుకు ముందుకు రాలేదట. ఈ విషయాన్ని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తన ఆత్మకథ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’లో రాసుకొచ్చారు. ‘నేను ఈ కథను హృతిక్ రోషన్‌కి చెప్పాను. కానీ అప్పటికే అతడి చేతిలో క్రిష్ సినిమాలు ఒప్పుకోవడం వల్ల ఈ సినిమాకు నో చెప్పారు. ఆ తర్వాత నాతో కలిసి రంగ్ దే బసంతి సినిమా చేసిన అమిర్ ఖాన్ సైతం ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అప్పుడు ఈ సినిమాకు రణవీర్ సింగ్ సరిపోతాడని అనుకున్నాను. కానీ అతడు కూడా ఈ సినిమాను వదిలేశాడు. కేవలం 15 నిమిషాలు కథ విన్న ఫర్హాన్ అక్తర్ మాత్రం వెంటనే ఒప్పుకున్నాడు” అంటూ రాసుకొచ్చారు.
ఈ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.168 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీకి రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాగే . ఫర్హాన్ అక్తర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. నివేదికల ప్రకారం ఈ సినిమా మొత్తం 55 అవార్డులు గెలుచుకుందట. ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..