
రాకింగ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆతర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో యష్ కూడా నటిస్తాడని, ఈ సినిమా షూటింగ్ గురించిన సమాచారం.
‘రామాయణం’ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. నెగెటివ్ రోల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ఈ విషయం గోప్యంగా ఉండేది. తరువాత యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేశారు. రావణుడి పాత్రలో నటించేందుకు ఆసక్తితో ఉన్నానని తెలిపారు. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ లో యష్ ఎప్పుడు పాల్గొంటాడు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఫిలింఫేర్ రిపోర్ట్ ప్రకారం మార్చి నెలలో యష్ ‘రామాయణం’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. దీంతో రావణుడిగా యష్ లుక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకు ముందు ‘రామాయణం’ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా ఉండాలి. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..