Uday Kiran: 40 లక్షలతో నిర్మిస్తే 8 కోట్లు రాబట్టిన చిత్రం.. ఉదయ్ కిరణ్ తొలి రెమ్యునరేషన్ ఏంతంటే.. .

ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. అలాగే మొదటి సినిమాలో ఉదయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ కెమిట్రీ అభిమానులకు నచ్చేసింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ రామోజీ రావు ఈ చిత్రాన్ని కేవలం రూ.42 లక్షల రూపాయాలతో నిర్మించారట. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని అడియన్స్ ముందుకు వచ్చింది.

Uday Kiran: 40 లక్షలతో నిర్మిస్తే 8 కోట్లు రాబట్టిన చిత్రం.. ఉదయ్ కిరణ్ తొలి రెమ్యునరేషన్ ఏంతంటే.. .
Uday Kiran
Follow us

|

Updated on: Jun 23, 2024 | 12:38 PM

ఉదయ్ కిరణ్.. ఈ పేరు చెప్పగానే ఎంతో మంది అభిమానుల కళ్లు చెమర్చుతాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ కుర్రాడు హీరోగా వెండితెరపై సందడి చేసి అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. హీరోగా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టించిన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత కెరీర్‏లో బ్యాలెన్స్ కోల్పోయాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. 2000లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. అలాగే మొదటి సినిమాలో ఉదయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ కెమిట్రీ అభిమానులకు నచ్చేసింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ రామోజీ రావు ఈ చిత్రాన్ని కేవలం రూ.42 లక్షల రూపాయాలతో నిర్మించారట. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని అడియన్స్ ముందుకు వచ్చింది.

రూ.42 లక్షలతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 8 కోట్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను రాబట్టింది. కానీ ఈ సినిమాకు హీరోగా ఉదయ్ కిరణ్ కేవలం రూ.11000 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు వర్క్ చేసిన డైరెక్టర్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ఇద్దరూ అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ సినిమాకు ముందుగా ఉదయ్ కిరణ్ కాకుండా మరో హీరోను తీసుకున్నారట. ఇందులో ఉదయ్ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాల్సింది. కానీ సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా ఎంపికైన వ్యక్తి హ్యాండ్ ఇవ్వడంతో ఉదయ్ కిరణ్ ను హీరోగా ఫైనల్ చేశారు.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఉదయ్.. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో నువ్వు నేను సినిమాతో మరో హిట్ అందుకున్నారు. అలా చిత్రం, నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హాట్రిక్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమకథ చిత్రాలతో మెప్పించిన ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం ఆయన నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడిని భరించలేక 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.