అప్పుడు అమాయకంగా.. ఇప్పుడేమో ఇలా.. జర్నీ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయింది..!
కొంతమంది హీరోయిన్ హిట్స్ అందుకున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నా కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాగే జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మడు కూడా అంతే.. ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోని సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతూ ఉంటారు. ఒకటి రెండు సినిమాలకే చాలా మంది దూరం అవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్ హిట్స్ అందుకున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నా కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాగే జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మడు కూడా అంతే.. ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోని సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి. 2011 డిసెంబరు 16న విడుదలైన ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ తో పాటు తమిళ్ హీరో జై కూడా నటించాడు. ఈ సినిమా ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లోనూ డబ్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? తన క్యూట్ నెస్ తో.. అమాయకత్వపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆమె. ఆమె పేరు అనన్య. తెలుగులో కేవలం ఒకటి, రెండు సినిమాల్లోనే నటించింది అనన్య. 2008లో మొట్టమొదటిసారి పాజిటివ్ అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది అనన్య.
అనన్య ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో ఈ అమ్మడు అఆ సినిమాలో నటించింది. నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాలో హీరో నితిన్ కు చెల్లెలిగా నటించి మెప్పించింది అనన్య. అలాగే చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మహర్షిలో నరేష్ కు జోడిగా నటించింది. అయితే అనన్య ఇప్పుడు ఎలా ఉంది. ఏం చేస్తుంది అన్నది చాలా మందికి తెలియదు. దాంతో ఈ అమ్మడు ఎలా ఉందా అని చాలా మంది గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు. దాంతో అనన్య లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
