Pawan Kalyan: ఇన్‌స్టాలో పవన్‌ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న స్టార్‌ హీరోయిన్లు ఎవరో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జైహింద్‌ అనే బయోతో తన ఇన్‌స్టా ఖాతాను ఓపెన్‌ చేశారు. అలా ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్‌ చేశారో లేదా ఫాలోవర్లు పోటెత్తారు. దెబ్బకు ఇన్‌స్టా మొత్తం షేక్‌ అయ్యింది.

Pawan Kalyan: ఇన్‌స్టాలో పవన్‌ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న స్టార్‌ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Pawan Kalyan

Updated on: Jul 10, 2023 | 1:05 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జైహింద్‌ అనే బయోతో తన ఇన్‌స్టా ఖాతాను ఓపెన్‌ చేశారు. అలా ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్‌ చేశారో లేదా ఫాలోవర్లు పోటెత్తారు. దెబ్బకు ఇన్‌స్టా మొత్తం షేక్‌ అయ్యింది. ఫాలోవర్ల విషయంలో రికార్డులు బద్ధలయ్యాయి. ఇప్పటివరకు (జులై 10 మధ్యాహ్నం) వరకు పవన్‌ అనుసరిస్తున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరింది. అది కూడా ఒక్క పోస్ట్‌ పెట్టకుండానే. మరోవైపు పవన్‌ ఇన్‌స్టాలో మొదటగా ఏం పోస్ట్‌ చేస్తారోనని ఫాలోవర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మొదటి పోస్ట్‌ పెడితే మాత్రం పవన్‌కు మరింత మంది ఫాలోవర్స్‌ పెరిగే అవకాశం ఉంది. కాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇన్‌స్టాలో పవన్‌ను ఫాలో అవుతున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు. శ్రుతిహాసన్‌, కీర్తి సురేష్‌ తదితర అందాల తారలు పవన్‌ను అనుసరిస్తున్నారు.

ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉంటున్నారు పవన్‌ కల్యాణ్. ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్‌ నటించిన బ్రో చిత్రం జులై 28న గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పవన్‌, సాయిల ఫస్ట్‌లుక్స్‌, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇటీవలే రిలీజైన మై డియర్‌ మార్కండేయ సాంగ్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. బ్రో తో పాటు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌.

 

ఇవి కూడా చదవండి

Pawan Kalyan Instagram

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..