Aishwarya Rai: ఆ స్టార్ హీరోతో సినిమా చేయనని చెప్పిన ఐశ్వర్య.. ఎందుకో తెలుసా.. ?

|

Oct 29, 2024 | 8:35 PM

ఐశ్వర్య రాయ్.. భారతీయ సినీ ప్రపంచంలో అందాల రాశి. అప్పటికీ.. ఇప్పటికీ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఓ హీరో సరసన నటించనని చెప్పేసిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..

Aishwarya Rai: ఆ స్టార్ హీరోతో సినిమా చేయనని చెప్పిన ఐశ్వర్య.. ఎందుకో తెలుసా.. ?
Aishwarya Rai
Follow us on

భారతీయ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమాలో ఐశ్వర్యరాయ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఇండియన్ సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ తనే. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీకి భారతీయ సినిమా ప్రపంచం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ సినిమాతో ఐశ్వర్యరాయ్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ రూపొందించిన జీన్స్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల అడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. జీన్స్ సినిమా తర్వాత ఐశ్వర్యకు తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

అయితే తమిళంలోనే ఐశ్వర్యకు సరైన బ్రేక్ వచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. జీన్స్ విజయం తరువాత ఇద్దరు, ప్రియురాలు పిలిచింది వంటి చిత్రాల్లో నటించి అలరించింది. అజిత్, మమ్ముట్టి, ప్రశాంత్ వంటి హీరోలతో కలిసి నటించిన ఐశ్వర్య. అప్పట్లోనే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి సరసన నటిస్తుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలు విఫలమయ్యాయి. విజయ్ తమిళ చిత్రంలో నటించేందుకు నటి ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించగా, విజయ్‌కి జోడీగా నటించేందుకు ఐశ్వర్యరాయ్ నిరాకరించింది. అందుకు కారణం కూడా వివరించింది.

విజయ్ దళపతి తనకంటే చిన్నవాడు అని.. తమ జోడి అసలు సెట్ కాదని.. అందుకే తన సరసన నటించనని చెప్పిందట. ఆ తర్వాత 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా విజయ్ సరసన తమిళన్ చిత్రంలో నటించింది. కొన్నాళ్లుగా ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వార్తలు నెట్టింట మారుమోగుతున్నాయి.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.