Prem Rakshit: ఆత్మహత్య అంచులవరకు వెళ్లిన వ్యక్తి.. ఇప్పుడు ఆస్కార్ ఎత్తుకు ఎదిగిపోయాడు..

నాటు నాటు పాట కోసం 80 రకాల వేరియెషన్స్ క్రియేట్ చేశాడు రక్షిత్… 18 రీటేకులు తీసుకున్నారు యాక్టర్స్… ఒక నెలలో 97 డాన్స్ మూవ్‌మెంట్స్ రూపొందించడం అంటే మాటలు కాదు

Prem Rakshit: ఆత్మహత్య అంచులవరకు వెళ్లిన వ్యక్తి.. ఇప్పుడు ఆస్కార్ ఎత్తుకు ఎదిగిపోయాడు..
Rajamouli - Prem Rakshith
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2023 | 1:18 PM

నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. ఒక తెలుగు సినిమా పాట ఇప్పుడు ప్రపంచ సెల్యులాయిడ్ ప్రేమికుల హార్ట్ బీట్ గా మారిపోయింది. సినిమా కోసం 19 నెలలు కష్టపడి.. 20 పాటలు చంద్రబోస్ రాస్తే.. అందులో నాటు నాటు ఎంచుకున్నారు రాజమౌళి. ఇక నాలుగున్నర నిమిషాల ఈ పాట చిత్రీకరణకు దాదాపు 20 రోజులు.. 43 రీటేక్ లు అవసరం అయ్యాయి. ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని యూనిట్ ముందునుంచీ నమ్మింది. ఇక ఈ పాట సంగీతం.. పాడిన వారు.. నటించిన వారూ వీరంతా తెలుగు చిత్రసీమలో తమదైన స్టైల్ లో టాప్ ప్లేస్ లో ఉన్నవారే. అయితే, ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే.. మిగిలిన కొరియోగ్రాఫర్స్ లా ఈయన టీవీ షోలలో కనిపించరు. పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. కానీ.. ప్రస్తుత తెలుగు సినిమా ప్రపంచంలో ది బెస్ట్ అని చెప్పుకునే కొరియోగ్రాఫర్స్ లో మొదటి వరుసలో ప్రేమ్ రక్షిత్ ఉంటారు. ఇప్పుడు నాటు నాటుతో ప్రపంచస్థాయిలో మొదటి వరుసలో నిలిచారు. ప్రేమ్ రక్షిత్ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన గురించి తెలుసుకుంది. ఈరోజు ఈ పాటతో ఆయన అద్భుతం అని అందరూ అనవచ్చు కానీ.. కష్టాన్ని ఎదురీది.. నమ్ముకున్న రంగంలో ప్రాణం పెట్టి పనిచేస్తే ఎటువంటి అద్భుతం సృష్టించవచ్చో ప్రేమ్ రక్షిత్ జీవితం చెబుతుంది.

చెన్నై మేరీనా బీచ్ లో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన ఒక వ్యక్తి.. ఈరోజు ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టిస్తాడాని బహుశా కాలానికి కూడా తెలిసి ఉండదు. అవును.. ప్రేమ్ రక్షిత్ బతకలేక చనిపోదామని అనుకున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఆయన కథ టూకీగా తెలుసుకోవాల్సిందే.. ప్రేమ్ తండ్రి ఒకప్పుడు వజ్రాల బిజినెస్ చేసేవారు. 1993లో కుటుంబ విబేధాల కారణంగా ఆయన ఆస్తులు పోయాయి.. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడిపోయారు. ఈ పేదరిక పరిస్థితిలో ఆయన సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్ గా మారారు. ప్రేమ్ రక్షిత్ టైలర్ షాప్ లో పనిచేయడం చేసేవారు. ఆయనకు కూడా డ్యాన్స్‌పై ఇంట్రస్ట్ ఉండేది. అందుకు సంబంధించి ప్రయత్నాలు కూడా చేసేవారు. కొన్నిరోజులు అలానే జీవితాన్ని నెట్టుకుని వచ్చారు. కానీ, ఆర్ధిక పరిస్థితులలో ఎటువంటి మార్పు లేదు. పేదరికంతో విసిగిపోయిన ప్రేమ్ బతకలేమని భావించి చెన్నై మెరీనా బీచ్ కు ఒక సైకిల్ వేసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. అదీ ఎందుకో తెలుసునా? తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు తన కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారనీ.. దానితో కుటుంబానికి కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని. విధి అంటే ఇదే.. సరిగ్గా ఆత్మహత్య చేసుకునే చివరి క్షణంలో ప్రేమ్ కు ఒక విషయం గుర్తొచ్చింది. తాను బీచ్ కు వేసుకుని వచ్చిన సైకిల్ పక్కింటి వారి వద్ద అరువు తెచ్చుకున్నానని.. ఇప్పుడు తాను చనిపోతే.. సైకిల్ ఓనర్ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడని అనిపించి.. సైకిల్ ఇంటి వద్ద ఇచ్చేసి మళ్ళీ వద్దామని ఇంటికి చేరుకున్నారు.

ఇంటిలో ఇలా అడుగుపెట్టీ పెట్టగానే.. ప్రేమ్ కు నీకు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని తండ్రి చెప్పాడు. దాంతో తన కష్టాలు తీరిపోయాయని.. ప్రేమ్ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నారు. ఒక్క క్షణం ఆయన జీవితాన్ని మార్చేసింది. చనిపోవాలని అనుకున్న వాడిని సైకిల్ నేరుగా సినిమాల్లో పడేసింది.. అక్కడ నుంచి తన కష్టంతో ఒక్కో పాట దాటుతూ నాటు రూటులో ప్రపంచ సినిమా కొరియోగ్రఫీపై తనదైన ముద్ర వేశారు ప్రేమ్ రక్షిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.