AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: రాజమౌళి మన జాతి సంపద.. జక్కన్నపై దిగ్గజ దర్శకుడు మహేష్‌ భట్‌ ప్రశంసల వర్షం

ట్రిపులార్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్ల పరంగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిందీ సినిమా. ఇక తాజాగా ఆస్కార్‌ అవార్డు అందుకోవడంతో...

Rajamouli: రాజమౌళి మన జాతి సంపద.. జక్కన్నపై దిగ్గజ దర్శకుడు మహేష్‌ భట్‌ ప్రశంసల వర్షం
Mahesh Bhatt
Narender Vaitla
|

Updated on: Mar 13, 2023 | 1:35 PM

Share

ట్రిపులార్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్ల పరంగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిందీ సినిమా. ఇక తాజాగా ఆస్కార్‌ అవార్డు అందుకోవడంతో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా పేరు మారుమోగింది. దీనంతటికీ కారణం ఒకే వ్యక్తి. అతను మరెవరో కాదు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు రాజమౌళి. బాహుబలితో ఇండియాకు తన సత్తా చాటిన జక్కన్న.. ఇప్పుడు ట్రిపులార్‌తో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మన సినిమా సత్తా చాటారు. దీంతో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌ భట్ సైతం ప్రశంసలు కురిపించారు.

రాజమౌళీ మన జాతీ సంపద అని కొనియాడారు. భారతీయ సినిమాను రాజమౌళి మరో మెట్టు ఎక్కించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బాహుబలి పార్ట్ 1తో మనల్ని అబ్బురపరిచాడని, సెకండ్ పార్ట్ ఇంకా బాగా వచ్చిందన్నారు. ఫిలిమ్‌ మేకింగ్‌కు ప్రపంచమే మేల్కొంది. ఆయన ఇంకా మాట్లాడుతూ..’అయితే రాజమౌళి తన సత్తాను పూర్తిగా చాటుకోలేదని నేను భావిస్తున్నారు. అవతార్‌ సృష్టికర్త జేమ్స్‌ కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ భావన కలిగింది.’ అని చెప్పుకొచ్చారు.

‘దక్షిణ భారతదేశంలోని చిత్రనిర్మాతలు వచ్చి ఉత్తర భారతదేశంలోని ప్రజల హృదయాల్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి రాజమౌళి దారి వేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ సినిమా స్థాయిని చాటారు. అమెరికాలో హాలీవుడ్‌లో పని చేసే ఓ ఎడిటర్‌ ట్రిపులార్ చిత్రాన్ని పొగిడారు. ఎన్నైఆర్‌ఐలు ఇండియన్‌ మూవీస్‌ను మెచ్చుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒక అమెరికన్‌ ఇండియన్ చిత్రాన్ని పొగడడం నిజంగానే గొప్ప విషయం. ఇక ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. అంతర్జాతీయ సినిమా మేకర్స్‌ కంటే ఇండియన్స్‌ తక్కువ కాదనే ఆత్మ విశ్వాసాన్ని భారతీయుల్లో నింపార’ని తెలిపారు.

‘రాజమౌళికి చిన్ననాటి నుంచి సినిమా అంటే ఇష్టం. డిజిటల్ యుగంతో సినిమా నిర్మాణం రూపురేఖలు మారిపోవడంతో తాను ఆయుధంగా చేసుకున్న సాంకేతిక మాంత్రికుడు. భారతీయ భావోద్వేగాలతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ చిత్ర నిర్మాతల సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు ఉంది. అందుకే రాజమౌళి మనకు లభించిన బహుమతి. మనం అతనిని ఆదరించాలి. ఎంతో మంది స్టార్‌లున్నా.. సినిమా విజయం కోసం అతను వారిపై ఆధారపడరు. ఎందుకంటే తన కథన నైపుణ్యాలు, సాంకేతికతోనే అద్భుతాలు క్రియేట్‌ చేస్తాడు. మీరు నాచో నాచో పాటను చూసినప్పుడు, అది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది ఎందుకంటే మీరు యూరోపియన్ కావచ్చు, మీరు అమెరికన్ కావచ్చు, మీరు చైనీస్ కావచ్చు, మీరు జపనీస్ కావచ్చు. కానీ పాట, ట్యూన్ యొక్క మెలోడీ మంత్రముగ్దుల్ని చేసింది’ అని చెప్పుకొచ్చారు.

‘ఇక రాజమౌళితో పాటు అని కుటుంబ సభ్యులు మొత్తానికి సినిమా నిర్మాణం పట్ల గౌరవం కలిగి ఉన్నారు. అందుకే అతను జాతీ సంపద అని నేనంటున్నాను. ఇంతటి విజయాలను అందుకున్నా రాజమౌళి నిత్యం ఒక స్టూడెంట్‌గానే ఉంటాడు. ప్రపంచ వేదికపై భారత్‌కు స్థానం కల్పించినందుకు మనందరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. రాజమౌళితో నాకు వ్యక్తిగతంగా కాకపోయినా జూమ్ కాల్‌లో సంభాషించే అవకాశం లభించింది’ అని రాజమౌళితో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు మహేష్‌ భట్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..