Dil Ruba Trailer: మళ్లీ లవర్ బాయ్‏గా మారిన కిరణ్ అబ్బవరం.. దిల్ రూబా ట్రైలర్ చూశారా.. ?

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవలే క సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా మెప్పించాడు కిరణ్.

Dil Ruba Trailer: మళ్లీ లవర్ బాయ్‏గా మారిన కిరణ్ అబ్బవరం.. దిల్ రూబా ట్రైలర్ చూశారా.. ?
Dillruba Trailer

Updated on: Mar 06, 2025 | 6:04 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం హిట్ తర్వాత ఇటీవలే క మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. విభిన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి లవర్ బాయ్ గా అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దిల్ రూబా. డైరెక్టర్ విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన రుక్సర్ థ్లిల్లాన్ కథానాయికగా నటిస్తుంది. మనసును హత్తుకునే ప్రేమకథతో రూపొందించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ట్రైలర్ రిలీజ్ చేశారు. నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ సాగింది. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్ కు నా దృష్టిలో విలువ లేదు అని కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్స్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

క సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన కిరణ్.. ఇప్పుడు దిల్ రూబా సినిమాలో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. అలాగే అటు యాక్టింగ్, ఇటు యాక్షన్ సీక్వెన్స్ లు అలరించేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us