Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..

|

Feb 20, 2022 | 4:58 PM

టాలీవుడ్ లో టాలెంట్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు.. రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..
Kiran Abbavaram
Follow us on

Kiran Abbavaram : టాలీవుడ్ లో టాలెంట్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు.. రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. అంతకు ముందుపలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ యంగ్ హీరో తొలి సినిమాతోనే తన నటన తో ప్రేక్షకులను మెప్పించాడు. రాజావారు.. రాణిగారు సినిమా తర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు సినిమాలతో విజయాలను అందుకున్న కిరణ్ ఇప్పుడు సెబాస్టియన్‌గా రావడానికి రెడీ అవుతున్నాడు. ‘సెబాస్టియన్ పిసి 524’సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్. ‘సెబాస్టియన్‌ పిసి524’ సినిమాలో కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , ఓ అందమైన మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకున్న్నాయి. ఇక టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఈ సినిమాలో కిరణ్ రేచీకటి తో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడు. అయితే ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే  పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ను ఈ నెల 25వ తేదీనే రంగంలోకి దింపుతున్నారు. దాంతో ఆ రోజున రావలసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ‘గని’ సినిమాలు వాయిదా పడ్డాయి.వాటితో పాటు ఈ కుర్ర హీరో సినిమాకూడా వెనక్కు వెళ్ళింది. మార్చి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సెబాస్టియన్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో రోహిణి కనిపించనున్నారు. గిబ్రాన్ ఈమూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..